Fighter 6 Days Collections: ఫైటర్‌కు నమ్మలేని వసూళ్లు.. 6 రోజుల్లో వంద కోట్లు దాటి.. హిట్ కావాలంటే!
బాలీవుడ్‌లో చాలా మందే బడా హీరోలు ఉన్నారు. కానీ, వారిలో దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఒకడు. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో అలరిస్తోన్న అతడు.. ఇటీవలే 'ఫైటర్' అనే యాక్షన్ మూవీతో వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే మంచి స్పందన అందుతోంది. ఫలితంగా మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం ఇది డౌన్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'ఫైటర్' మూవీ 6 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూడండి!
ఫైటర్‌గా అడుగెట్టిన హీరో:బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ సినిమానే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు నిర్మించారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ ఇచ్చారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్:హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసుకున్నారు.
ఆరో రోజు ఎన్ని కోట్లంటే:హృతిక్ రోషన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ రావడంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీకెండ్‌లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, వర్కింగ్ డేస్‌లో మాత్రం డౌన్ అవుతూ వస్తోంది. ఫలితంగా 6వ రోజు 'ఫైటర్' చిత్రం రూ. 7.75 కోట్లు నెట్, రూ. 12 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఆరు రోజులకు ఎంతంటే:'ఫైటర్' మూవీకి ఆరు రోజులకూ కలిపి మంచి వసూళ్లే వచ్చాయి. మొదటి రోజు రూ. 22.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 39.50 కోట్లు, మూడో రోజు రూ. 27.50 కోట్లు, నాలుగో రోజు రూ. 29 కోట్లు, ఐదో రోజు రూ. 8 కోట్లు, 6వ రోజు రూ. 7.75 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా 6 రోజుల్లో రూ. 134.25 కోట్లు నెట్ రాబట్టింది. రూ. 228 కోట్లు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే:హృతిక్ రోషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో రిలీజ్ కాలేదు. ఫలితంగా ఈ చిత్రం ఆరు రోజుల్లో ఓవర్సీస్‌లో 6.8 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 56.51 కోట్లు వసూలు అయ్యాయి.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 6 రోజుల్లో ఇది రూ. 134 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 66 కోట్లు నెట్‌ను రాబడితేనే ఈ సినిమా హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











