Fighter 7 Days Collections: బాక్సాఫీస్‌పై ఫైటర్ ఫైటింగ్.. 300 కోట్లకు చేరువలో హృతిక్ రోషన్
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అమ్మాయిల కలల రాకుమారుడు అంటే ఇలానే ఉంటాడేమో. ఈ హీరోకు దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ అండ్ పాపులారిటీ అయితే ఉంది. హ్యాండ్సమ్ హంక్ అంటూ అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఆయన నటించిన తాజా చిత్రం ఫైటర్. రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫైటర్ బాక్సీఫీస్ వద్ద మీద దండయాత్ర మొదలుపెట్టాడు. ఫలితంగా కాసుల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో ఫైటర్ వారం రోజుల్లో ఎంత కలెక్ట్ చేశాడో ఈ స్టోరీలీ చూద్దాం.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, అందాల భామ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ సినిమా 'ఫైటర్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మంచి టాక్ లభించింది.

ఫైటర్ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్ పాండే, అజిత్, అంకులు కలిసి దీనిని భారీ బడ్జెట్ తో నిర్మించారు. యానిమల్ లో నటించిన అనిల్ కపూర్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాకు సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు కూడా.
హృతిక్ రోషన్ నటించిన ఈ ఫైటర్ సినమాకు మొదటి నుంచి మంచి బజ్ నెలకొంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లకు పైగా బిజినెస్ నమోదు చేసుకుంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో ఘనంగా విడుదల చేశారు.

వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే.. హృతిక్ రోషన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్లో తెరకెక్కిన ఫైటర్ మూడో చిత్రం. అంతకు ముందు వీరి కాంబోలో బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు వచ్చాయి. ఇక మూడో చిత్రంగా 'ఫైటర్' రాగా.. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. దీంతో డీసెంట్ ఓపెనింగ్స్ లభించాయి. కానీ వీకెండ్ లో ఈ సినిమా భారీ వసూళ్లు చేస్తుంది. వర్కింగ్ రోజుల్లో మాత్రం కాస్త డౌన్ అవుతూ వస్తుంది. ఫలితంగా 9వ రోజు 'ఫైటర్' చిత్రం రూ. 6.35 కోట్లు నెట్, రూ. 11 కోట్లు గ్రాస్ రాబట్టింది.

7 రోజులకు ఎంతంటే.. 'ఫైటర్' మూవీకి ఆరు రోజులకూ కలిపి మంచి వసూళ్లే వచ్చాయి. మొదటి రోజు రూ. 36.04 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 64.57 కోట్లు, మూడో రోజు రూ.56.19 కోట్లు, నాలుగో రోజు రూ. 52.74 కోట్లు, ఐదో రోజు రూ. 16.33 కోట్లు, 6వ రోజు రూ. 4.95 కోట్లు, 7వ రోజు రూ. 6.35 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఫలితంగా 7 రోజుల్లో రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే.. హృతిక్ రోషన్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. ఆయనకు చాలా దేశాల్లో ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు మేకర్స్. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో రిలీజ్ కాలేదని తెలుస్తోంది. ఫలితంగా ఈ చిత్రం 7 రోజుల్లో ఓవర్సీస్‌లో 69 మిలియన్ డాలర్లు రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి? ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా వచ్చిన 'ఫైటర్' రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ కూడా జరుపుకుంది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.... 7 రోజుల్లో ఇది రూ. 140.35 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 60 కోట్లు నెట్‌ను రాబడితేనే ఈ సినిమా హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











