Fighter 8 Days Collections: 200కోట్ల ఫైటర్ సినిమా.. 8 రోజుల్లో వచ్చిందంతే.. ఇంకా ఎంత రాబట్టాలంటే?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. జనవరి 25వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమాలో విమానాలతో యాక్షన్ సీన్లు హైలైట్‍గా నిలవగా.. బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్‍లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక రెండో వారం ఎనిమిదో రోజు మాత్రం బిగ్ డ్రాప్ చూసింది. ఆ వివరాల్లోకి వెళితే...
సిద్ధార్థ్ ఆనంద్... గత ఏడాది ప్రారంభంలో పఠాన్ చిత్రంతో బ్లాక్‍బాస్టర్ కొట్టారు. మరి ఈ ఏడాది ఫైటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ఫైటర్ మూవీలో హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొణ్ హీరోయిన్‍గా నటించింది. గత ఏడాది తెరకెక్కించిన పఠాన్ చిత్రంలోనూ తనే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో హృతిక్, దీపికా ఎయిర్ ఫోర్స్ యుద్ధవిమానాల పైలెట్లుగా కనిపించారు.

అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీదా షేక్, అషుతోశ్ రానా వంటి తదితరులు కీ రోల్ పోషించారు. వియాకామ్ 18, మ్యాట్రిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‍పాండే, రామన్ చిబ్, అజిత్ అంధారే, అంకు పాండే, కెవిన్ వాజ్, మమతా భాటియా ఈ మూవీని సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది.
హృతిక్ రోషన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ఫైటర్. వీరి కాంబోలో ఇప్పటికే బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ఫైటర్ సినిమా 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఎలా ఉన్నాయంటే... మొదటి రోజు రూ. 36.14 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 64.47 కోట్లు, మూడో రోజు రూ.56.29 కోట్లు, నాలుగో రోజు రూ. 52.34 కోట్లు, ఐదో రోజు రూ. 16.35 కోట్లు, 6వ రోజు రూ. 4.99 కోట్లు, 7వ రోజు రూ.11.70 కోట్లు, 8వ రోజు రూ.10కోట్లు వసూళ్లు రాబట్టింది. ఫలితంగా 8 రోజుల్లో రూ. 252.52 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇండియాలో ఇలా.. భారత్‍లోనే ఫైటర్ మూవీకి 8 రోజుల్లో రూ.146.25 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. గ్రాస్ రూ.168.75 కోట్లు వసూలు చేసింది. తొలి వారం రూ.140 నెట్ వసూళ్లు రాగా.. ఐదో రోజు రూ. 5.75 కోట్లకు పరిమితమైంది. విదేశాల్లోనూ ఫైటర్ మోస్తరు వసూళ్లను రాబడుతోంది. ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఈ సినిమా రూ.72కోట్లు రాబట్టింది. ఇక ఇక ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లో ఈ సినిమా రూ.252.52 కోట్లకు పైగా వసూలు చేసింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరుపుకుంది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా... 8 రోజుల్ వరల్డ్ వైడ్ గా లో ఇది రూ. 156.25 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 44 కోట్లు నెట్‌ను రాబడితేనే ఈ సినిమా హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











