Fighter 9 Days Collections: కుప్పకూలిన ఫైటర్.. ఇటు 250, అటు 150 కోట్లు ఔట్.. కానీ హిట్ కావాలంటే!
బాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలలో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకుని సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఒకడు. ఎన్నో ఏళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో అలరిస్తోన్న అతడు.. ఇటీవలే 'ఫైటర్' అనే యాక్షన్ మూవీతో వచ్చాడు.
దీనికి ఆరంభంలో మంచి స్పందన వచ్చినా.. క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. ఫలితంగా ఈ చిత్రానికి వసూళ్లు పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'ఫైటర్' మూవీ 9 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

ఫైటర్‌గా ఎంట్రీ ఇచ్చిన స్టార్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ మూవీనే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు నిర్మించారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ చేశారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్: సరైన హిట్ కోసం చూస్తున్న హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

తొమ్మిదో రోజు ఎన్ని కోట్లంటే: హృతిక్ రోషన్ - సిద్దార్థ్ ఆనంద్ కలయికలో రూపొందిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ రావడంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీకెండ్‌లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, వర్కింగ్ డేస్‌లో మాత్రం పడిపోతూనే ఉంది. ఫలితంగా 9వ రోజు 'ఫైటర్' చిత్రం రూ. 5.35 కోట్లు నెట్, రూ. 9 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టింది.

తొమ్మిది రోజులకు ఎంతంటే: 'ఫైటర్' మూవీకి 9 రోజులకూ కలిపి తక్కువ వసూళ్లే వచ్చాయి. మొదటి రోజు రూ. 22.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. 2వ రోజు రూ. 39.50 కోట్లు, 3వ రోజు రూ. 27.50 కోట్లు, 4వ రోజు రూ. 29 కోట్లు, 5వ రోజు రూ. 8 కోట్లు, 6వ రోజు రూ. 7.50 కోట్లు, 7వ రోజు రూ 6.50 కోట్లు, 8వ రోజు రూ. 6 కోట్లు, 9వ రోజు రూ. 5.35 కోట్లతో కలిపి.. మొత్తంగా రూ. 151.85 కోట్లు నెట్, రూ. 257 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే: హృతిక్ రోషన్‌కు వరల్డ్ వైడ్‌గా చాలా దేశాల్లో ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో రిలీజ్ కాలేదు. ఫలితంగా ఈ చిత్రం 9 రోజుల్లో ఓవర్సీస్‌లో 9 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 74.69 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: పూర్తి స్థాయి యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 9 రోజుల్లో ఇది రూ. 151 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 49 కోట్లు నెట్‌ను రాబడితేనే ఈ సినిమా హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











