Fighter Closing Collections: ఫ్లాప్ టాక్‌తో ఫైటర్ సంచలనం.. అన్ని కోట్లతో తొలి హీరోగా హృతిక్ రికార్డు
సౌత్ నుంచి ఇప్పుడు చాలా మంది పాన్ ఇండియా స్టార్లు వచ్చారు కానీ.. బాలీవుడ్‌లో ఎప్పుడో ఆ రేంజ్ హీరోలు హవాను చూపించారు. వారిలో హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఒకడు. అప్పట్లో వరుస హిట్లతో సత్తా చాటిన అతడు.. ఈ మధ్య భారీ హిట్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే హృతిక్ 'ఫైటర్' అనే మూవీని చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు తక్కువగా లభించాయి. అయినా తాజాగా టార్గెట్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో 'ఫైటర్' మూవీ ఫుల్ రన్‌లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో లుక్కేయండి!
ఫైటర్‌గా హృతిక్ వచ్చాడు
హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన యాక్షన్ మూవీనే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ తీసిన ఈ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు. ఈ సినిమాను వయాకామ్ 22 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు నిర్మించారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్
ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో తెరకెక్కిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయింది.
అలాంటి టాక్‌తో భారీగానే
హృతిక్ రోషన్ - దీపికా పదుకొణే జోడీగా నటించిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా ఫస్ట్ వీక్‌లో భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, తర్వాత నుంచి ఇది క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా టార్గెట్ చేరుకోలేదని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇది రన్ కొనసాగించి టార్గెట్ కొట్టేసింది.
అక్కడ రిలీజ్ కాకున్నా
హృతిక్ రోషన్‌కు వేరే దేశాల్లో సైతం ఫాలోయింగ్, మార్కెట్ భారీ స్థాయిలో ఉంది. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో విడుదల కాలేదు. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో ఓవర్సీస్‌లో 12 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 99.61 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
మొత్తంగా ఎన్ని కోట్లంటే
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'ఫైటర్' సినిమాకు మొదటి వారంలో రూ. 146.50 కోట్లు నెట్ వచ్చింది. అలాగే, రెండో వారంలో రూ. 41 కోట్లు, మూడో వారంలో రూ. 14.20 కోట్లు నెట్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత ఇది మోస్తరుగానే కలెక్షన్లను రాబట్టింది. ఇలా ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ. 204.20 కోట్లు నెట్‌తో పాటు రూ. 343 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?
క్రేజీ కాంబోలో రూపొందిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ రన్‌లో ఇది రూ. 204.20 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.20 కోట్లు లాభాలను ఇది సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











