Fighter Day 1 Collections: హృతిక్ మూవీకి ఊహించని వసూళ్లు.. అన్ని కోట్లతో టాప్ సినిమాగా రికార్డు
ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంతో మంది పాన్ ఇండియా రేంజ్ హీరోలు ఉన్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే వరుస హిట్లతో సత్తా చాటుతుంటే.. మరికొందరు మాత్రం సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ఒకడు. గతంలో వరుస హిట్లు కొట్టిన అతడు.. ఈ మధ్య ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హృతిక్ 'ఫైటర్' అనే యాక్షన్ మూవీతో పేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మాత్రం తొలి రోజే డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. మరి 'ఫైటర్' మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూడండి!
ఫైటర్‌గా ఎంట్రీ ఇచ్చిన హీరో:హృతిక్ రోషన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రమే 'ఫైటర్'. ఈ మూవీని మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకు తదితరులు నిర్మించారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ సంగీతాన్ని అందించారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్:స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
అలాంటి టాక్‌తో డీసెంట్:హృతిక్ రోషన్ హీరోగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'ఫైటర్' మూవీ భారీ అంచనాల నడుమ జనవరి 25వ తేదీన విడుదలైంది. దీనికి ఓవర్సీస్‌లోని ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో మోస్తరు స్పందనే వచ్చింది. దీంతో ఈ మూవీకి ఓపెనింగ్స్ డీసెంట్‌గానే వస్తాయని అంచనాలు వేశారు.

తొలి రోజు ఎన్ని కోట్లంటే:బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ లభించింది. ఫలితంగా దీనికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రానికి మొదటి రోజు రూ. 22 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 35 కోట్లు గ్రాస్ వసూలైంది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఇది రూ. 22 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 178 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.

హిందీలో టాప్ ప్లేస్‌లోనే:హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీ మొదటి రోజు ఆశించిన దానికంటే తక్కువ వసూళ్లనే రాబట్టింది. అయినప్పటికీ 2024లో హిందీలో ఓపెనింగ్ డేన అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో మొదటి స్థానానికి చేరింది. అయితే, 2023 - 24 సంవత్సరాల్లో వచ్చిన సినిమాలను చూసుకుంటే మాత్రం 'ఫైటర్' చిత్రం 7వ స్థానంలో నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











