Fighter Day 3 Box Office Collections ఫైటర్‌కు మూడు రోజుల్లోనే 150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల దుమారం!
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, అందాల భామ దీపిక పదుకోన్ జంటగా నటించిన యాక్షన్, వార్ బేస్డ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఫైటర్ చిత్రం తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. టాప్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రీరిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
భారత్, పాకిస్థాన్ సరిహద్దులో జరిగే యుద్ద దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన
ఫైటర్ సినిమా సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమాకు 210 కోట్ల రూపాయల బిజినెస్ వ్యాల్యూను కట్టారు. భారీ అడ్వాన్స్ బుకింగ్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించిన ఈ చిత్రాన్ని 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఫైటర్ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ రెస్సాన్ కనిపిస్తున్నది. నార్త్ అమెరికా అంటే.. కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఇతర ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. యూఏఈ మినహాయించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఈ సినిమా రిలీజ్‌ను నిషేధించారు. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 2.6 మిలియన్ డాలర్లు అంటే 21.61 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఫైటర్ సినిమా తొలి రోజు విషయానికి వస్తే.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. అలాగే రెండో రోజు రెండితలు మేర కలెక్షన్లను పెంచుకొని 42 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే ఇండియాలో 67 కోట్ల రూపాయలు నికరంగా వసూళ్లను సాధించింది.
ఇక మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఫైటర్ చిత్రం 28 కోట్ల నికర వసూళ్లను, 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో
ఇండియాలో 100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని దాటుతుందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.
ఇండియాలో ఫైటర్ చిత్రం 100 కోట్ల గ్రాస్, అలాగే ఓవర్సీస్‌లో రెండు రోజుల్లో 21.6 కోట్లు గ్రాస్ కలిపితే మొత్తంగా 122 కోట్ల మేర వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఓవర్సీస్‌లో మూడో రోజుల కలెక్షన్లతో ఈ సినిమా 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు చేరువయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











