Coolie vs War 2 Advance Booking: లెక్కలు మార్చేసిన హృతిక్, ఎన్టీఆర్.. కూలీపై వార్ 2 పైచేయి

ఆగస్ట్ 14న బాక్సాఫీస్ వద్ద అసలు సిసలు సమరం జరగనుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాలు రిలీజ్ కానున్నాయి. రెండు సినిమాల మీద భారీగా హైప్ ఉండగా.. అభిమానులు రెండింటి బాక్సాఫీస్ లెక్కలు, బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్ గురించి సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ.. రజనీకాంత్ వారిద్దరినీ ఢీకొట్టడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రతిరోజూ వార్ 2 అడ్వాన్స్ బుకింగ్ లెక్కల్ని కూలీతో పోల్చి చూస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్‌లో కూలీ, వార్ రికార్డ్
వార్ 2, కూలీ రెండు చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో జరుగుతూ ఓపెనింగ్ ఇరగదీయాలని ఆశిస్తున్నాయి. తమిళ యాక్షన్ థ్రిల్లర్ కూలీ.. ఇండియా వైడ్ అడ్వాన్స్ బుకింగ్‌లలో మంచి ఓపెనింగ్ నమోదు చేసింది. విడుదలకు ముందే ఈ సినిమా 27 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. కూలీ చిత్రానికి తొలిరోజు దేశవ్యాప్తంగా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో 10,322 షోలకు గాను 12. 24 లక్షల టికెట్స్ అమ్ముడైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అటు వార్ 2 చూస్తే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 13,748 షోలకు గాను కేవలం 3.46 లక్షల టికెట్లు అమ్మడై తద్వారా 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ చెబుతోంది.

Hrithik Roshan s War 2 overtakes Rajinikanth s Coolie in hourly ticket sales on BMS

ఇండియాలో కూలీ డామినేషన్
ఈ గణాంకాలు గమనిస్తే కూలీ సినిమా చూసేందుకు తమిళ ప్రేక్షకులు ఉత్సాహం చూపిస్తున్నారు. మొదటి రోజే తమిళ వెర్షన్‌లో 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై.. 22.81 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్‌లో 1.70 లక్షల టికెట్లు అమ్ముడై 3.40 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా సాక్‌నిక్ డేటా చెబుతోంది. అలాగే హిందీ బెల్ట్‌లో కూలీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 80 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. కన్నడలో 5.86 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు ఒక్క అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

నార్త్‌లో వార్ 2 హవా
వార్ 2 విషయానికి వస్తే.. హిందీ సినిమా కావడంతో నార్త్‌లో ఈ చిత్రం ఆధిపత్యం చెలాయిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్‌లో 1.8 లక్షల టికెట్లు అమ్ముడై 6.50 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించడంతో తెలుగులోనూ ఈ సినిమాకు గట్టిగానే బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 1.50 లక్షల టికెట్లు అమ్ముడై 3.70 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే తమిళంలో 9.49 లక్షల రూపాయల చొప్పున ఇండియా వైడ్‌గా వార్ 2కు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా నివేదికలు చబుతున్నాయి.

రజనీ ముందు నిలబడలేకపోయిన వార్ 2
అటు ఓవర్సీస్‌లోనూ రజనీకాంత్ ఛరిష్మా ముందు వార్ 2 నిలబడలేకపోతోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ప్రీ సేల్స్‌లో 2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 17 కోట్ల రూపాయలు) వసూలు చేసి కబాలీ రికార్డ్‌ను బ్రేక్ చేశారు రజనీకాంత్. వార్ 2 విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలో 520K కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో ఒక్క అమెరికా నుంచే 470K కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

కూలీపై వార్ 2 పైచేయి
ఇప్పటి వరకు కూలీ సినిమా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించగా.. బుధవారం ఉదయం నుంచి పరిస్ధితి ఒక్కసారిగా మారిపోయింది. గంటల వారీ టికెట్ల అమ్మకాలలో వార్ 2 ముందంజ వేస్తోంది. గంట క్రితం బుక్ మై షోలో కూలీకి 2.93k టికెట్లు విక్రయం జరగ్గా.. వార్ 2కి 3.64K టికెట్లు అమ్ముడైనట్లుగా బుక్ మై షో గణాంకాలు చెబుతున్నాయి. కొద్దిగంటల్లో యూఎస్ ప్రీమియర్స్ పడనున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.

More from Filmibeat

Read more about: war 2 coolie box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X