twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వామ్మో! రాధేశ్యామ్ బ‌డ్జెట్‌లో సగం సెట్స్ కోసమే.. మొత్తం 26.. ఎంత ఖర్చు పెట్టారంటే..?

    |

    టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. పెద్దగా గ్యాప్ లేకుండా రానున్న రోజుల్లో తన మార్కెట్ ను మరింత పెంచుకోవడం కాయంగా కనిపిస్తోంది. అయితే రాధేశ్యామ్ సినిమాను కూడా ప్రభాస్ స్థాయిని బట్టే తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో భారీ సెట్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 26 సెట్లు నిర్మించగా బడ్జెట్ లో ఎక్కువ శాతం వాటికే ఖర్చు చేశారట.

    అడ్వెంచర్ ప్రేమకథ

    అడ్వెంచర్ ప్రేమకథ

    జిల్ దర్శకుడు రాధాకృష్ణ రెండవ అవకాశంలోనే ప్రభాస్ తో ఛాన్స్ కొట్టేశాడు. రెగ్యులర్ గా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ లాంటి ప్రేమ కథలను చేయాలని అనుకుంటున్న సమయంలో రాధాకృష్ణ చెప్పిన అడ్వెంచర్ ప్రేమకథ బాగా నచ్చేసింది.

    100కోట్ల లోపే అనుకున్నప్పటికి

    100కోట్ల లోపే అనుకున్నప్పటికి

    దాదాపు దర్శకుడు రాధాకృష్ణ రెండేళ్లు స్క్రిప్ట్ పైనే కూర్చున్నాడు. ఫుల్ స్క్రిప్ట్ సిద్దమైన తరువాతే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. అయితే సినిమాను చిన్న బడ్జెట్ లోనే పూర్తి చేయాలని అనుకున్నారు. 100కోట్ల లోపే అనుకోని యూవీ క్రియేషన్స్ స్కెచ్ వేసింది. కానీ ఆ తరువాత మళ్ళీ ప్లాన్స్ మారాయి.

    మొత్తం 26 రకాల సెట్స్

    మొత్తం 26 రకాల సెట్స్

    సినిమా షూటింగ్ మొదలయ్యాక ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. కథ కోసం స్పెషల్ గా సెట్స్ వేస్తేనే బావుంటుందని మొత్తంగా 26 సెట్స్ ను నిర్మించారట. దీంతో బడ్జెట్ మెల్లగా 200కోట్లను దాటింది. ఇక సెట్స్ పక్కాగా వేయాలని అనుకోవడంతో ఆ సంఖ్య మరింత పెరిగి 300కోట్లను దాటినట్లు సమాచారం.

    Recommended Video

    Jagapathi Babu Biography, హిట్లు కాదు వ్యక్తిత్వం ముఖ్యం ||| Oneindia Telugu
    వాటి కోసమే 106కోట్లు

    వాటి కోసమే 106కోట్లు

    కేవలం 26 రకాల సెట్స్ కోసమే 106కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ లెక్కలతో సినిమా రూపురేఖలు మారిపోయాయి. అయితే ఎంత ఖర్చు చేసినా కూడా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ నెమ్మదిగా అడుగులు వేస్తోంది. అయితే ఇంతవరకు అభిమానులకు పూర్తిగా సంతృప్తినిచ్చే సరైన అప్డేట్ రాలేదు. మరి రానున్న రోజుల్లో ఏదైనా సాంగ్ తో అయినా కిక్కిస్తారో లేదో చూడాలి.

    English summary
    It is known that Tollywood Rebel star Prabhas is currently spinning the wheel as a Pan India star. Without a big gap, it looks set to expand its market in the coming days. However, Radheshyam's film is also being screened on the level of Prabhas. It seems to be building huge sets especially in the movie. A total of 26 sets were built and most of the budget was spent on themselves.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X