Kalavathi లిరికల్ వీడియో సాంగ్ కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా.. థమన్ ఆలోచనతోనే భారీగా..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా టాప్ ట్రెండింగ్ లిస్టులో ఉంది మొదటిసారి మహేష్ బాబు కీర్తి సురేష్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలను మరింతగా పెరుగుతున్నాయి. అయితే ఇటీవల సినిమాకు సంబంధించిన మొదటి పాటను విడుదల చేయగా సోషల్ మీడియాలో ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. 24 గంటల్లోనే అత్యధిక వ్యూవ్స్ అందుకున్న లిరికల్ వీడియో గా కళావతి పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ పాట కోసం సంగీత దర్శకుడు తమన్ ద్వారానే నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

కళావతి అందరికి నచ్చేసింది

కళావతి అందరికి నచ్చేసింది

సంగీత దర్శకుడు తమన్ ఇటీవల కాలంలో ఎలాంటి పాట చేసిన కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటున్నాడు. లిరికల్ వీడియోలు మిలియన్స్ వ్యూవ్స్ తో టాప్ ట్రెండింగ్ లిస్టులో చేరుతున్నాయి. ఇక సర్కారు వారి పాట సినిమా కోసం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో థమన్ ఐదు ప్రత్యేకమైన పాటలను కంపోజ్ చేస్తున్నాడు. ఇక మొదటి పాట కళావతి అనుకున్నట్లుగానే అందరికీ చాలా బాగా నచ్చేసింది.

 ఆ విషయంలో వెనక్కి తగ్గకుండా..

ఆ విషయంలో వెనక్కి తగ్గకుండా..

మహేష్ బాబు కీర్తి సురేష్ కలయిక మొదటిసారి కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. అంతేకాకుండా గీత గోవిందం సినిమా తర్వాత దర్శకుడు పరుశురామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో ఒక మంచి నమ్మకాన్ని కలిగిస్తోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని కూడా చెబుతున్నారు. నిర్మాతలు కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. అందుకే ఖర్చు విషయంలో వారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

థమన్ ఆలోచనతో..

థమన్ ఆలోచనతో..

సర్కారు వారి పాట సినిమాలో ప్రతి పాట కూడా చాలా ప్రత్యేకంగా కంపోజ్ చేసిన థమన్.. పాట జనాలకు ఎక్కువగా రీచ్ అయ్యేలా కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కళావతి పాటను మొదట నార్మల్ గా విడుదల చేస్తే సరిపోతుంది అనుకున్నారట. కానీ సంగీత దర్శకుడు థమన్ మాత్రం కేవలం లిరికల్ వీడియో గానే కాకుండా ప్రత్యేకంగా కంపోజ్ చేసి పడుతున్నట్లు షూట్ చేసి వీడియో లో కూడా మిక్స్ చేయాలి అని నిర్మాతలకు సూచించాడట.

కళావతి కోసం ఖర్చు ఎంతంటే..

కళావతి కోసం ఖర్చు ఎంతంటే..

ఇక ఈ లిరికల్ వీడియోలో అనుకున్నట్లుగానే థమన్ తో పాట కోసం కష్టపడిన ఇతర టెక్నీషియన్లు అలాగే సింగర్ సిద్ శ్రీరామ్ కూడా ప్రత్యేకంగా హైలెట్ అయ్యారు. ఈ పాట కోసం నిర్మాతలు దాదాపు 40 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ తరహా ప్లాన్ తో తమన్నా సక్సెస్ అయ్యాడు. కష్ట పడిన పాట జనాలకు చాలా తొందరగా రావాలి అంటే ఈ తరహాలో ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలి అని ఫిక్స్ అవుతున్నాడట.

Recommended Video

SSMB 28 రెండో హీరోయిన్ వేట | Sarkaru Vaari Paata ఓవర్సీస్ రేంజ్ || Filmibeat Telugu
భారీగా వ్యూవ్స్ రావాలని..

భారీగా వ్యూవ్స్ రావాలని..

ఇక కళావతి పాటకు సంబంధించిన వ్యూవ్స్ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ పాట కు భారీ స్థాయిలో వ్యూవ్స్ రావడానికి పేయిడ్ ప్రమోషన్స్ కూడా చేసినట్లుగా టాక్ వస్తోంది. అందుకోసమే భారీగా ఖర్చు అయినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో వారే చెప్పాలి. ఇక థమన్ అయితే ఈ సినిమాలోని ప్రతి పాట కూడా జనాలకు కనెక్ట్ అయ్యేలా చేయాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి మిగతా పాటలు ఏ స్థాయిలో సక్సెస్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X