Hari Hara Veera Mallu: అట్లుంటది మరి పవన్‌తో.. ఒక్క రోజుల్లోనే భారీ ఆఫర్లు.. బిగ్గెస్ట్ బిజినెస్!

టాలీవుడ్ మోస్ట్ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ ఎలాంటి సినిమా చేసినా కూడా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటాయి. ఇక పవన్ హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు మళ్ళీ ఎక్కువవుతున్నాయి. ఇంతకుముందు సినిమా మేకింగ్ పై అనేక అనుమానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్కరోజులోనే బయ్యర్ల నుంచి ఆఫర్లు ఒక రేంజ్ లో వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

పవన్ మొదటిసారి ఇలా..

పవన్ మొదటిసారి ఇలా..

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మొదటిసారి చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎనౌన్స్ చేసినప్పుడే అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చారిత్రక నేపథ్యంలో సినిమాలు చేసింది లేదు. కానీ ఈసారి ఫస్ట్ టైం క్రిష్ దర్శకత్వంలో ఒక విభిన్నమైన చారిత్రక అంశాలను ఆధారంగా చేసుకుని సినిమా చేస్తూ ఉండడంతో పవన్ ఎలా ఉంటాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఆ రూమర్స్ వైరల్

ఆ రూమర్స్ వైరల్

అసలు సినిమా ఫస్ట్ లుక్ అప్పుడే భారీ స్థాయిలో స్పందన వచ్చింది. తప్పకుండా దర్శకుడు క్రిష్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరపైకి తీసుకువస్తాడు అని కూడా అందరూ నమ్మకంతో ఉన్నారు. అయితే మధ్యలో మాత్రం కొంత సినిమా షూటింగ్ కు గ్యాప్ రావడంతో వివిధ రకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. సినిమా షూటింగ్ ఆగిపోయింది అని క్రిష్ మేకింగ్ పై పవన్ నమ్మకంతో లేడు అని చాలా వార్తలు కన్ఫ్యూజన్ కు గురి చేసాయి.

 పెరిగిన డిమాండ్

పెరిగిన డిమాండ్

ఇక మొత్తానికి దర్శకుడు ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మరొక పవర్ఫుల్ టీజర్ తో అంచనాలను మళ్ళీ మారిపోయాయి. అప్పటివరకు ఉన్న నెగిటివ్ టాక్స్ అంతా కూడా ఆ ఒక్క టీజర్ తోనే మాయమైపోయాయి. దీంతో సినిమాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయబోతున్నట్లు అనిపిస్తుంది.

గ్రాండ్ యాక్షన్ సీన్స్

గ్రాండ్ యాక్షన్ సీన్స్

ఈ సినిమాలో ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్ కూడా హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా ప్రముఖ బాలీవుడ్ టెక్నీషియన్ వర్క్ చేస్తున్నాడు. అతని పేరు శ్యామ్ కౌషల్. ఇంతకు ముందు పద్మావత్, దంగల్, ధూమ్ 3 సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్బజ్ వర్క్ చేశాడు. ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో గ్రాండ్ స్కేల్ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

బిగ్గెస్ట్ బిజినెస్

బిగ్గెస్ట్ బిజినెస్

హరిహర వీరమల్లు సినిమాను నిర్మాత ఏఎమ్.రత్నం దాదాపు 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు. అయితే ఇప్పుడు ఉన్న డిమాండ్ ను బట్టి సినిమా దాదాపు పెట్టిన పెట్టుబడినే మొత్తం విడుదలకు ముందే వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉందట. ఒక విధంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక స్థాయిలో బిజినెస్ చేయబోతోంది. ఇతర భాషలలో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. మరి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X