twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa 2 సినిమాకు కళ్ళు చెదిరే ఆఫర్.. యూఎస్ లో డిమాండ్ మామూలుగా లేదు

    |

    అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక డిమాండ్ ను బట్టి మార్కెట్ లో మరింత బిజినెస్ పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈసారి కంటెంట్ కు తగ్గట్టుగా మరింత ఎక్కువగా ఖర్చు చేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఓవర్సీస్ లో కూడా మంచి డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యూఎస్ లో ఇటీవల సినిమా రిలీజ్ హక్కుల కోసం కొందరు డిస్ట్రిబ్యూటర్స్ భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    ప్రమోషన్స్ చేయకపోయినా

    ప్రమోషన్స్ చేయకపోయినా

    సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ కు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. పుష్ప పార్ట్ 1 అసలు ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ముఖ్యంగా హిందీలో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు హిందీలో సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అయ్యింది అంటే ఇప్పుడు పుష్ప 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది ఉహాలకందడం లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    అప్పుడే డీల్స్ స్టార్ట్

    అప్పుడే డీల్స్ స్టార్ట్

    ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. మొదటి షెడ్యూల్లో హీరో ఇంట్రడక్షన్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయడం జరిగింది. మరో రెండు వారాలు పాటు కొనసాగే ఈ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత చిత్ర యూనిట్ సభ్యులు రెండవ షెడ్యూల్ను మొదలు పెట్టబోతున్నారు. అయితే సినిమా షూటింగ్స్ కూడా పూర్తవ్వకముందే అప్పుడే బిజినెస్ కు సంబంధించిన డీల్స్ కూడా మాట్లాడుకుంటున్నారు.

    అప్పటినుంచే పోటీ

    అప్పటినుంచే పోటీ

    ఒక విధంగా పుష్ప సెకండ్ పార్ట్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా రిలీజ్ హక్కులను దక్కించుకోవడానికి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా నిర్మాతలతో చర్చలు జరుపుకున్నారు. అయితే షూటింగ్ మొదలైన తర్వాత సినిమా రేంజ్ ను బట్టి బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటే బాగుంటుంది అని కొంతకాలం ఎదురు చూడాలి అని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆఫర్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తూ ఉండడంతో సినిమా బడ్జెట్ ను బట్టి డీల్స్ క్లోజ్ చేయాలని ఆలోచిస్తున్నాట్లుగా తెలుస్తోంది.

    యూఎస్ రిలీజ్ హక్కుల కోసం

    యూఎస్ రిలీజ్ హక్కుల కోసం

    పుష్ప సెకండ్ పార్ట్ కు ఓవర్సీస్ లో కూడా ఈసారి మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా అమెరికాలో కూడా పుష్ప భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఇక సెకండ్ పార్ట్ కు అక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. మైత్రి మూవీ మేకర్స్ కు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు క్లోజ్ కాబట్టి తీవ్రస్థాయిలో ఈ సినిమా హక్కుల కోసం పోటీపడుతున్నట్లుగా తెలుస్తోంది

    ఆ రేంజ్ లో ఆఫర్

    ఆ రేంజ్ లో ఆఫర్

    పుష్ప ఫ్యాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న విషయం తెలిసింది. అయితే ఈ సినిమాలో యు ఎస్ థియేట్రికల్ రిలీజ్ కోసం కొందరు డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 55 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిర్మాతలు మాత్రం 65 కోట్లకు కోట్ చేస్తున్నట్లు సమాచారం.. ఇక ఎలాగైనా ఈ డీల్ సెట్ చేసుకోవాలి అని డిస్ట్రిబ్యూటర్లు అయితే నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. ఇక దాదాపు 60 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Huge demand for Pushpa 2 movie in usa and pre release bussiness offers
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X