RC 15: రామ్ చరణ్ సినిమాతో దిల్ రాజుకి జాక్ పాట్.. నాన్ థియేట్రికల్ గా భారీ లాభాలు
మెగా పవర్ స్టార్ రాంచరణ్ RRR సినిమా అనంతరం మరిన్ని పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నాడు. అందుకోసం టాలెంటెట్ దర్శకులను సెలెక్ట్ చేసుకొని తన మార్కెట్ స్థాయిని పెంచుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో అయితే చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో శంకర్ సందేశాత్మక చిత్రం పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన అన్ని హక్కులను జీ సంస్థ సొంతం చేసుకున్నట్లు గా తెలుస్తోంది. అందుకోసం నిర్మాత దిల్ రాజుకి భారీ స్థాయిలో అమౌంట్ కూడా ఇచ్చినట్లు సమాచారం.

సోషల్ డ్రామా..
ప్రస్తుతం రామ్ చరణ్ లైనప్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఒక దానికొకటి సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పక్క ప్లానింగ్ తోనే కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. RRR సినిమా అనంతరం శంకర్ దర్శకత్వంలో చేయబోయే 15 వ సినిమా పూర్తిగా సోషల్ డ్రామా తో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు సమాచారం.

భారీ బడ్జెట్ తో RC 15
కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలీ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో అలరించనున్నారు. అయితే సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ పై ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కోసం దాదాపు 250కోట్ల నుంచి 270 మధ్యలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

200కోట్ల ఆఫర్..
సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అసలైతే గత ఏడాది నుంచి ఈ డీల్ కోసం చాలా సంస్థలు దిల్ రాజుతో చర్చలు జరపగా ఆయన ఫైనల్ గా జీ సంస్థకు 200కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ఇలా అన్ని కోణాల్లో జీ సంస్థ RC 15 నాన్ థియేట్రికల్ సర్వ హక్కులు సొంతం చేసుకోబోతున్నట్లు సమాచారం.

బడ్జెట్ ఎక్కువ కాకుండా
ఒక విధంగా ఈ డీల్ దిల్ రాజుకు జాక్ పాట్ అని చెప్పవచ్చు. పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా నాన్ థియేట్రికల్ రూట్ లోనే వస్తుండడంతో మిగతా థియేట్రికల్ బిజినెస్ మొత్తంలో లాభాలు అందుకునే అవకాశం ఉంటుంది. ఒక విధంగా శంకర్ కూడా చాలా జాగ్రత్తగా బడ్జెట్ ఎక్కువ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ విషయంలో దిల్ రాజు లక్కీ అని అంటున్నారు.

రిలీజ్ ఎప్పుడంటే..?
ఇక సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అయితే అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. దర్శకుడు శంకర్ సినిమా షూటింగ్ ని ఈ ఏడాది అక్టోబర్ లోపు ఫినిష్ చేసి.. డిసెంబర్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటిని కూడా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది అంటే 2023 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ఒక టార్గెట్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











