RC15: డిజాస్టర్ సెంటిమెంట్.. రామ్ చరణ్ ఇండస్ట్రీ రికార్డ్ పక్కా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఏడాది RRR సినిమా తో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా పవర్ ఫుల్ పాత్రలో కనిపించి మొదటి పాన్ ఇండియా విజయాన్ని షేర్ చేసుకున్నాడు. ఇక అదే ఊపులో ఆచార్య సినిమాతో కూడా తండ్రితో మరొక విజయాన్ని అందుకోవాలని చూశాడు. కానీ ఆ సినిమా ఊహించని విధంగా రిజిస్టర్ అయిన విషయం తెలిసిందే.
అయితే రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ ను చూసిన తర్వాత మళ్ళీ వెంటనే బిగ్గెస్ట్ హిట్స్ తో బౌన్స్ బ్యాక్ అవుతూ ఉండడం సెంటిమెంట్ గా వస్తోంది అనే చెప్పాలి. మగధీర సినిమా నుండి చూసుకుంటే హిట్ అయిన సినిమా తర్వాత రామ్ చరణ్ ఊహించని విధంగా ఆరెంజ్ అనే మరో సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను సొంతం చేసుకున్నాడు.

ఇక రంగస్థలం సినిమా తర్వాత ఊహించని విధంగా వినయ విధేయ రామ తో మరొక పెద్ద పెద్ద డిజాస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల RRR సినిమా అనంతరం ఆచార్య సినిమాతో మరో ఆల్టైమ్ డిజాస్టర్ ను సొంతం చేసుకున్న చరణ్ ఇలా ప్రతిసారి ఒక సక్సెస్ చూసిన తర్వాత మరో డిజాస్టర్ ను చూస్తున్నాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ మరొక పెద్ద ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంటున్నాడు.
ఇక ఈ సెంటిమెంట్ ప్రకారం ఆలోచిస్తే రామ్ చరణ్ శంకర్ కలయికలో రాబోయే సినిమా మాత్రం తప్పకుండా ఆల్ టైం బాక్స్ ఆఫీస్ రికార్డు గా నిలుస్తుంది అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ట్రెండ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక రామ్ చరణ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నా విషయం తెలిసిందే. అలాగే గౌతమ్ తిన్ననూరితో కూడా చరణ్ ఒక సినిమా చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











