F3 theatrical business: వరుణ్ తేజ్, వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్.. ఆ రూట్లో లాభం ఎంతంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మళ్లీ సినిమాల సందడి మొదలైంది గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ ప్రేక్షకులను ఎంతగానో ఊరించిన కొన్ని సినిమాలు ఇప్పుడు భారీ స్థాయిలో విడుదల అవుతున్నాయి. ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు విడుదల అనంతరం ప్రస్తుతం మరొక ముఖ్యమైన సినిమా విడుదలకు సిద్ధమైంది. ఎఫ్ 2 సినిమా కు కొనసాగింపుగా వస్తున్న ఎఫ్ 3 సినిమా ఈ నెల చివరలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు సమాచారం. ఒక విధంగా వరుణ్ తేజ్ వెంకటేష్ సినిమా కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్రాండ్ రిలీజ్
ఈ ఏడాది సంక్రాంతికి రావల్సిన F3 సినిమా కరోనా పరిస్థితుల కారణంగా అనేక సార్లు వాయిదా పడింది. ఇక మొత్తానికి మే 29వ తేదీన చిత్ర యూనిట్ సభ్యులు భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

F2 తో భారీగా లాభాలు
దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చివరగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబుతో బిగ్ సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి ఈసారి F3 సినిమాతో మరో బిగ్ సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. F2 సినిమా దాదాపు 80 కోట్ల వరకు లాభాలను అందించడంతో ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.

తొందరపడకుండా..
ఎఫ్ 2 సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడంతో ఇప్పుడు F3 సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో నిర్మాత తొందరపడకుండా టేబుల్ ప్రాఫిట్ వచ్చే విధంగా సినిమాను ఏరియాల వారిగా మంచి రేటుకు అమ్ముతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో కాస్త బడ్జెట్ అయితే ఎక్కువ అయింది. ఇప్పటికైతే F3 బిజినెస్ అయితే భారీగానే చేసినట్లు సమాచారం.

ప్రీ రిలీజ్ బిజినెస్..
ఒక విధంగా వరుణ్ తేజ్ వెంకటేష్ కెరీర్లోనే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి ఈ సినిమా ద్వారా ఈ ఇద్దరు హీరోలు కూడా పెద్ద మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. మొత్తంగా F3 సినిమా అయితే వరల్డ్ వైడ్ గా 50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లుగా సమాచారం.

నాన్ థియేట్రికల్ గా..
ఇక తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ను ఈజీ గా ఫినిష్ చేస్తుంది అని కూడా టాక్ వస్తోంది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ గా సినిమాకు 20 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు సమాచారం. ఇక బాక్సాఫీస్ వద్ద మరొక 30 కోట్ల లాభం వచ్చినా కూడా నిర్మాత ఈజీగా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











