Allu Arjun Salary per Endorsement: ఒక్క యాడ్ కోసం బన్నీ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
సినిమా ప్రపంచంలో ఒక్కసారి స్టార్ హోదా వచ్చింది అంటే దాన్ని కాపాడుకోవడం మరొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇక ఆ విధంగా కాపాడుకుంటే మాత్రం సినీతరులకు కేవలం సినిమాల ద్వారానే కాకుండా మరొక దారిలో కూడా భారీ ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో బ్రాండ్ ప్రమోషన్స్ అనేవి సినీ తారలకు మరొక ముఖ్యమైన జాబ్ గా ఉపయోగపడుతొంది. ఒక్కొక్కరు కంపెనీల బ్రాండ్స్ కు ప్రమోషన్స్ చేస్తూ భారీ స్థాయిలో పేమెంట్స్ అందుకుంటున్నారు. ఇక ఆ లిస్టులో అల్లు అర్జున్ ఇటీవల తన రేట్లు ఇంకాస్త పెంచినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ రూట్లోనే ఎక్కువ
బ్రాండింగ్ ప్రమోషన్స్ అనేవి ఇటీవల కాలంలో సినీ తారలకు చాలా కామన్ అయిపోయింది. కాస్త సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు అంటే చాలు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రమోషన్స్ చేస్తూ మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో అగ్ర హీరోలు చాలావరకు ఏడాదికి లేదా ఒక సినిమా చేస్తున్నారు. ఇక ఆ సినిమాకు వచ్చే రెమ్యూనరేషన్ కంటే కూడా కొన్నిసార్లు బ్రాండింగ్ ప్రమోషన్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం అందుతోంది.

సౌత్ స్టార్స్ డామినేషన్
ఇక ఇటీవల కాలంలో ముఖ్యంగా సౌత్ హీరోలకు ఫేమస్ బ్రాండ్ ప్రమోషన్స్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే వస్తున్నాయి. ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నారు. మరొక సౌత్ హీరో కన్నడ స్టార్ యష్ కూడా నేషనల్ లెవెల్ లో మరో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకున్నాడు. ఇక వీరికి వస్తున్న ఆఫర్లు చూస్తే ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కూడా వారి ముందు చాలా తక్కువే అని చెప్పాలి.

బాలీవుడ్ స్టార్స్ డౌన్
ఒకప్పుడు కేవలం బాలీవుడ్ స్టార్స్ కు మాత్రమే ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ లో బ్రాండ్స్ ప్రమోషన్స్ చేసే ఆఫర్లు బాగా వచ్చాయి. ముఖ్యంగా అందులో షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ అలాగే రణ్ బీర్ కపూర్ రణ్ వీర్ సింగ్ ఇలా స్టార్ హీరోలు అందరూ కూడా నేషనల్ లెవెల్ లో ప్రముఖ బ్రాండ్స్ కు ప్రమోషన్స్ చేస్తూ మంచి ఆదాయాన్ని అందుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు వారి కంటే ఎక్కువగా మన హీరోలు క్రేజ్ అందుకోవడంతో కంపెనీలన్నీ కూడా వీరివైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి.

బన్నీ పేమెంట్ ఎంతంటే?
పుష్ప సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కాబట్టి కొన్ని బడా కంపెనీలు ఇతని వైపే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ తో బ్రాండ్ ప్రమోషన్ కోసం దాదాపు 7.5 కోట్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ విధంగా ఏడాదికి అల్లు అర్జున్ ఆడుతూ పాడుతూ చేసినా యాడ్స్ ద్వారా 100 కోట్లకు పైగా ఆదాయాన్ని అందుకుంటాడు. మరి రాబోయే రోజుల్లో పుష్ప సెకండ్ పార్ట్ తో మళ్ళీ ఇంకా ఏ రేంజ్ లో తన ఆదాయాన్ని పెంచుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











