Identity Collections: ఐడెంటిటీ మూవీ కలెక్షన్లు.. త్రిష మూవీకి బంపర్ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్, మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ జంటగా నటించిన చిత్రం ఐడెంటిటీ. మలయాళ, తమిళ, కన్నడ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు అఖిల్ పాల్ దర్శకత్వం వహించారు. క్రైమ్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించారు. భారీ బజ్ ఏర్పడిన ఈ సినిమా జనవరి 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మలయాళంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు రాగమ్ మూవీస్, కాన్ఫిడెంట్ గ్రూప్ నిర్మించిన ఈ సినిమాను మరో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్రీ గోకులం మూవీస్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు నిర్మాతగా రాజు మలియత్, రాయ్ సీజే నిర్మాతలుగా వ్యవహరించారు. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫి, ఛామన్ ఛాకో ఎడిటింగ్, మ్యూజిక్ జాక్స్ బిజోయ్ అందించారు.

Identity Malayalam Movie Box Office Collections Worldwide

క్లాత్ స్టోరీలో పనిచేసే అమర్ అనే వ్యక్తి.. ఆ దుకాణంలోకి వచ్చే మహిళలను చాటుగా వీడియోలు తీసి వారిని, వారి కుటుంబ సభ్యులను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఓ రోజు ఈ విషయం తెలిసిన బాధితులు షాపుతోపాటు అమర్‌ను దహనం చేస్తారు. ఈ హత్య తర్వాత ఎన్ఎస్‌జీ కమాండో హరన్ శంకర్ (టొవినో థామస్), అలిషా (త్రిషా), అలెన్ ( వినయ్ రాయ్) జీవితాలను ఆ సంఘటన ఎలాంటి మలుపు తిప్పిందనే సినిమా కథ.

ఐడెంటిటీ సినిమాను స్టార్ యాక్టర్లు, టెక్నిషియన్‌తో ఖర్చుకు వెనుకాడకుండా రిచ్‌గా తీశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 12 కోట్ల రూపాయలు మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరగడం, ప్రమోషన్స్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

Identity Malayalam Movie Box Office Collections Worldwide

ఇక ఈ సినిమాకు మలయాళంలో మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. కేరళలో సుమారుగా 55 శాతం ఆక్యుపెన్సీ తొలి రోజు నమోదైంది. తమిళం, కన్నడలో కూడా సానుకూలంగా ఆక్యుపెన్సీ కనిపించింది. తెలుగులో మలయాళ వెర్షన్‌కు పెద్దగా స్పందన కనిపించికపోయినప్పటికీ.. వీకెండ్‌లో పుంజుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐడెంటిటీ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కేరళలో తొలి రోజు 2 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 15 లక్షల రూపాయలు, తమిళనాడులో 25 లక్షల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో మొదటి రోజు 2.5 కోట్ల నికరంగా, 5 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: trisha krishnan tovino thomas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X