Hrudhayam Murali Box Office: డీసెంట్‌గా హృదయం మురళి కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
తమిళ, మలయాళంలో స్టార్ యాక్టర్లు ఫాహద్ ఫాజిల్, అథర్వ, ప్రతీ ముకుందన్, కాయదు లోహర్, మాళవిక మోహనన్, తమన్ ఎస్, నిహారిక ఎన్ఎం, ఎంజెలీనా బీ, వీజే రక్షన్, ద్రావిడ్ సెల్వం, నటరాజన్ సుబ్రహ్మణ్యం నటించిన చిత్రం ఇదయం మురళీ. తెలుగులో హృదయం మురళీ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్ కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రానికి ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించారు. డాన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, సీహెచ్ సాయి, ఎఢిటర్: ప్రదీప్ ఈ రాఘవ్, మ్యూజిక్: తమన్ ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: ఎంఆర్ కార్తీక్ రాజ్‌కుమార్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన తమిళంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బిజినెస్ ఎంత? ఈ చిత్రం గత 3 రోజులుగా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

హృదయం మురళి (తమిళంలో ఇదయ మురళి) సినిమాలో టాప్ స్టార్స్ నటించడం స్పెషల్ ఎట్రాక్షన్. ఈ చిత్రాన్ని అమెరికా, ఇతర ప్రాంతాల్లో లావిష్‌గా చిత్రీకరించారు. ఈ సినిమాలో నటించిన యాక్టర్లు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కాస్ట్ కలిపి సుమారుగా 35 కోట్ల రూపాయల మేర అయింది. ఈ సినిమా కమిషన్ బేస్ మీద డాన్ ప్రొడక్షన్స్ సొంతంగా రిలీజ్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
గత రెండు రోజుల్లో ఈ సినిమా తమిళనాడులో 5.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 70 లక్షల రూపాయలు, కేరళలో 10 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 6.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో సుమారుగా 3 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 9.5 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
ప్రమోషన్స్ పెద్దగా నిర్వహించకపోవడం వల్ల ఈ సినిమా రిలీజ్ విషయం కూడా పెద్దగా తెలియలేదు. కానీ మూవీ రిలీజ్ తర్వాత పెరుగుతున్న మౌత్ టాక్ కారణంగా కలెక్షన్లు పుంజుకొంటున్నాయి. తొలి రోజు 2.5 కోట్లు వసూలు చేస్తే.. రెండో రోజు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా టాక్ పాజిటివ్‌గా మారితే రానున్న రోజుల్లో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.
ఇక మూడో రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. సాయంత్రం వరకు ఈ సినిమాకు సంబంధించి 2 లక్షల టికెట్లు తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో అమ్ముడుపోయాయి. 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. దాదాపు 1500 షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రం 3వ రోజు సుమారుగా 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతో ఈ చిత్రం 14 నుంచి 15 కోట్ల రూపాయల మేర వసూళ్లను నమోదు చేయవచ్చు. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద మెరుగైన వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications