తెలుగు నిర్మాతలని ఇలియానా భలే బకరాలని చేస్తోంది
తనని ఈ స్ధాయికి తీసుకు వచ్చిన తెలుగు పరిశ్రమ అంటే నార్త్ హీరోయిన్స్ కి భలే చిన్న చూపని మరో సారి రుజువైంది. రీసెంట్ గా బాలీవుడ్ లో ప్రవేశించిన ఇలియానా తన రెమ్యునేషన్ లో అరవై పర్శంట్ కోత విధించుకుంది. తెలుగు,తమిళంలో కోటి నుంచి కోటి పాతిక లక్షలు డిమాండ్ చేసే ఈ భామ హిందికి కేవలం యాభై లక్షలు ఇస్తే చాలంటోంది. ఇక తమిళంలోనూ ఆమె చేస్తున్న త్రి ఇడియట్స్ చిత్రానికి కేవలం కోటి మాత్రమే తీసుకుంటోంది.
అందులోనే ఆమె తన ఖర్చులన్నిటినీ చూసుకుంటానని కమిటైంది. తెలుగులో మాత్రం ఆమె పైసా కూడా తగ్గించనంటోంది. తెలుగులో శక్తి,నేనూ నా రాక్షసి అంటూ వరసగా ప్లాఫ్ లు వచ్చినా ఆమె లెక్క చేయటం లేదు. ఇక్కడ నిర్మాతల కంటే దర్శకుల దగ్గరే ఆమెకు పరిచయాలు ఎక్కువగా ఉండటంతో ఆమె అనుకున్న రెమ్యునేషన్ అందుతోంది అంటున్నారు.


Click it and Unblock the Notifications











