"బాహుబలి 2" కోటలు బద్దలు కొట్టిన "పుష్ప 2" .. ఇక నెక్స్ట్ వేసేది "కేజీఎఫ్ 2"నే

భారతీయ చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒక్క తెలుగు సినిమా నుంచే కాకుండా మన కంటే ముందే హిందీలో ధూమ్ సిరీస్ అని, క్రిష్ సిరీస్ అని ఉన్నాయి. ఇంకా తమిళ్‌లో అయితే యముడు, సింగం అలాగే కాంచన, ముని అంటూ చాలానే ఉన్నాయి. వీటిని పక్కన పెడితే మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి సరైన సీక్వెల్ బాహుబలి 2 పడిన తర్వాత భారతీయ సినిమా దగ్గర సీక్వెల్స్ ఫార్మాట్ మొత్తం మారిపోయింది అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

బాహుబలి 2 తర్వాత అప్పటి వరకు రీజనల్‌గా కొన్ని భాషల్లో మాత్రమే వచ్చే సీక్వెల్ సినిమాలు అక్కడ నుంచి పాన్ ఇండియా లెవెల్లోకి వచ్చాయి. ఇప్పుడు వస్తున్న సీక్వెల్స్‌కు కానీ సీక్వెల్ చేయాలి అనుకున్న సినిమాలు డెఫినెట్‌గా బాహుబలి 2 దాని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తావన లేకుండా ఉండదు. ఇలా సీక్వెల్స్ లో మన తెలుగు సినిమా ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తే ఇపుడు మళ్ళీ మన తెలుగు సినిమానే ఈ సీక్వెల్స్ అర్ధాన్ని రీడిఫైన్ చేస్తుందని చెప్పాలి.

in sequel pushpa 2 broke bahubali 2 record now target is kgf 2

కాగా ఇండియన్ సినిమా దగ్గర జనం ఓ సీక్వెల్ కోసం అంతలా ఎదురు చూసింది ఏదన్నా ఉంది అంటే అప్పుడు బాహుబలి 2, దాని తర్వాత కన్నడ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 అని చెప్పాలి. వీటిపై నెలకొన్న అంచనాలకు తగ్గట్లుగానే వసూళ్లు భారీ లెవెల్లో వచ్చాయి. వీటితో పాటుగా వీటి తరహాలో ఒక క్రేజీ క్లైమాక్స్ ఎండింగ్ లేకపోయినా కూడా ఇండియా వైడ్ రూల్ చేసిన సినిమా మాత్రం పుష్ప 2.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ పై నడిచిన ఈ చిత్రం ఇండియా వైడ్ ఇపుడు వండర్స్ సెట్ చేస్తుంది. ఇండియా వైడ్ గా ఇపుడు ఆ సీక్వెల్స్ రికార్డులు అన్నీ బ్రేక్ చేస్తూ సంచలనంగా మారింది అని చెప్పాలి. కాగా ఇండియన్ సినిమా దగ్గర వసూళ్ల పరంగా బాహుబలి 2 హైయెస్ట్ రికార్డు సెట్ చేసింది. కానీ బుకింగ్స్ పరంగా కేజీఎఫ్ 2 కి బుక్ మై షో యాప్ లో బిగ్గెస్ట్ రికార్డు ఉంది. కాగా పుష్ప వసూళ్ల పరంగా ఆల్రెడీ కేజీఎఫ్ చాప్టర్ 2 ని దాటేసింది.

in sequel pushpa 2 broke bahubali 2 record now target is kgf 2

కానీ ఇపుడు బుకింగ్స్ లో ఇండియా వైడ్ గా బాహుబలి 2 సెట్ చేసిన ఆల్ టైం రికార్డులు కోతలు బద్దలు కొట్టింది. ఇండియా వైడ్ గా బాహుబలి 2కి బుక్ మై షోలో 16 మిలియన్ కి పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. దీనిని పుష్ప 2 కేవలం 14 రోజుల్లోనే బ్రేక్ చేసి ఆల్ టైం టాప్ 2 లోకి వచ్చేసింది. ఇండియా వైడ్‌గా మొట్టమొదటి స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంది. దీనికి ఏకంగా 17 మిలియన్లకి పైగా బుకింగ్స్ నమోదు అయ్యాయట.

బాహుబలి 2, కేజీఎఫ్ చాప్టర్ 2‌లు ఈ బుకింగ్స్‌ని లైఫ్ టైం రన్ లో అందుకున్నాయి. కానీ పుష్ప 2 కేవలం రెండు వారాల్లోనే 16 మిలియన్ కి పైగా క్రాస్ చేసింది. సో 17 మిలియన్ ని కూడా క్రాస్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో మరో బిగ్గెస్ట్ రికార్డు డెఫినెట్ గా సెట్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చూడాలి పుష్ప 2 లెక్క ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో అనేది.

More from Filmibeat

Read more about: pushpa 2 allu arjun bahubali 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X