తెలుగు రాష్ట్రాల్లో మహర్షి కలెక్షన్ల సునామీ.. విడుదలైన 6 రోజుల్లోనే

సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల షేర్ రాబట్టి మహేష్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. నిడివి కాస్త ఎక్కువైందనే టాక్ వస్తున్నప్పటికీ మహర్షి మాత్రం ఎక్కడా వెనుకడుగేయకుండా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకలోకం మహర్షి సినిమాకు నీరాజనం పలుకుతున్నారు. రైతు నేపథ్యంలో చిత్రీకరించిన పలు సన్నివేశాలు అన్నివర్గాల ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తూ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి 6 రోజుల్లోనే 56 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ రికార్డ్ కావడం విశేషం.

In Telugu States Mahesh Babus Maharshi 6 days Collections

సూపర్ స్టార్ మహేష్ కెరీర్‌లో 25 వ సినిమాగా మహర్షి సినిమా రూపొందించబడింది. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా సంయుక్త సమర్పణలో దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వీ పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు. విడుదలైన అన్ని సెంటర్లలో ప్రస్తుతం మహేష్ జోరు కొనసాగుతోంది.

మరోవైపు మహర్షి ఎఫెక్ట్‌తో వీకెండ్ వ్యవసాయం అనే నయా ట్రెండ్ క్రియేట్ అయింది. నగరాల్లోని యువత వీకెండ్‌లో తమ సొంతూరుకెళ్లి పొలాల్లో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చిత్రంలో మూడు విభిన్న క్యారెక్టర్లలో నటించి సామాజిక విలువల పట్ల గుడ్ మెసేజ్ ఇచ్చారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మహర్షి సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహర్షి జోష్ చూస్తుంటే మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీగా అవతరించడం ఖాయం అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X