తెలుగు సినిమా దరిద్రం

By Staff

టాలీవుడ్ లో టీనేజ్ లవ్ స్టోరీస్ ఎన్నో వచ్చాయి. 'చిత్రం' సినిమా విజయంతో ఈ తరహా చిత్రాల రూపకల్పన ఊపందుకుంది. ఆ తర్వాత ఇంటర్మిడియట్ విధ్యార్థుల చుట్టూ తిరిగే ప్రేమకథలు ఎన్నో వచ్చాయి. ఈ చిత్రాలు ఎదిగీఎదగని వయసులో వున్న టీనేజర్స్ పై ఎంతో ప్రభావాన్ని చూపాయనడానికి ఇప్పుడు జరుగుతున్న ఉదంతాలే సాక్షి. ఈ కథలు బోరుకొట్టాయో ఏమో ఈ సారి మన దర్శకుల కన్ను పాఠశాల విధ్యార్థుల మీద పడింది. ఈ సారి 'టెన్త్ క్లాస్' అని కాలేజీలోకి అడుగుపెట్టబోయే పదవ తరగతి విధ్యార్థులను టార్గెట్ చేసారు. దీంతో పాఠశాలలో కూడా ప్రేమకథలు నడపచ్చని చాలా మంది తెలుసుకున్నారు.

ఈ సారి మన దర్శకులు ఇంకాస్త దిగజారి 'నైన్త్ క్లాస్' అన్న పేరుతో ఓ ప్రేమ కథను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విధ్యార్థుల మధ్య ప్రేమను చిగురింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టైటిల్ విని, అందులో నటిస్తున్న జంటను చూసిన వారు తెలుగు సినిమా దర్శకులకు పైత్యం నషాలానికి ఎక్కిందని విమర్శస్తున్నారు. ఒక వేళ కుర్రకారు ప్రేక్షకుల వల్ల ఈ చిత్రం గానీ హిట్ అయితే 'సిక్త్ క్లాస్', 'సెవెంత్ క్లాస్' అని మరింత 'లో-క్లాస్' ప్రేమకథలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

అయినా సినిమాలు తీసే ముందు అది సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న కనీస విజ్ఞత కొంత మంది దర్శకులకు లేకపోవడం శోచనీయం. అయినా మీ పిచ్చిగానీ సందేశాలు, ఆదర్శాలు అంటూ సినిమాలు తీస్తే చూసేవాల్లెవరని అంటున్న వారూ లేకపోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X