Indian 2 Closing Collections: ఇండియన్ 2 క్లోజింగ్ కలెక్షన్లు.. కమల్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

భారతీయ సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో వచ్చిన అగ్ర హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. దాని ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొడుతున్నాయి. తాజాగా భారీ అంచనాలతో రిలీజైన ఇండియన్ 2 చిత్రం ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఏ మేరకు నష్టాలను నమోదు చేసిందనే ట్రేడ్ వివరాల్లోకి వెళితే..

ఇండియన్ 2 సినిమాను టాప్ యాక్టర్లు కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఎస్‌జే సూర్య లాంటి వారితో రూపొందించారు. అలాగే టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తో ఈ సినిమాను 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. 28 ఏళ్ల తర్వాత ఇండియన్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఉండటంతో దేశవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్‌‌ను సొంతం చేసుకొన్నది.

Indian 2 Box Office Closing Collections Worldwide Shankar Movie Closes heavy loses at GBOC

అయితే ఈ సినిమా ఇండియన్ సినిమా పెట్టిన అంచనాలను, ఇచ్చిన అనుభూతిని మించి సంత‌ృప్తిని పంచలేకపోయింది. పేలవమైన కథ, కథనాలు, బలమైన క్యారెక్టర్లు లేకపోవవడంతో ఈ సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆరంభంలో సాధించిన భారీ ఓపెనింగ్స్‌ను కొనసాగించలేకపోయింది అనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి వచ్చింది.

ఇక ఈ సినిమా ఇండియాలో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దేశంలో 81 కోట్ల నికర కలెక్షన్లు, 94 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 51 కోట్లు రాబట్టింది. దాంతో ఈ మూవీ రెండు వారాల థి300 కయేట్రికల్ రన్‌లో కేవలం 145 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే కనీసం 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుందని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను నిర్ణయించారు. అయితే ఈ సినిమా మాత్రం0 కో కేవలం 145 కొట్లు మాత్రమే రాబట్టింది. దాంతో ఈ మూవీ సుమారుగా 150 కోట్ల మేర నష్టానికి లోనైందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది.

More from Filmibeat

Read more about: indian 2 prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X