Indian 2 Day 1 Box Office Collections: కమల్ మూవీకి షాకింగ్‌గా వసూళ్లు.. శంకర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

విశ్వ నటుడు కమల్ హాసన్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్ 2 సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. 28 ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య తదితరులు నటించారు. అయితే ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిసినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

ఇండియన్ 2 అలియాస్ భారతీయుడు 2 సినిమాలో కథ డిమాండ్ చేయడంతో స్టార్ నటీనటులు ఇందులో నటించారు. కాజల్ అగర్వాల్, ఇతర నటీనటులు కథలో భాగమైనప్పటికీ.. ఇండియన్ 2లో కాకుండా ఇండియన్ 3కి మార్చారు. అయితే ఈ సినిమా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ కాస్ట్‌తో కలిపి మొత్తంగా 250 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించారు.

Indian 2 Day 1 Box Office Collections Worldwide Kamal Haasan movie starts decent openings

ఇక ఈ సినిమాను ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. అయితే ఈ సినిమాను చాలా చోట్ల కమిషన్ బేస్ మీద రిలీజ్ చేశారు. అయితే అన్ని రకాల వాల్యూస్‌ను పరిగణనలోకి తీసుకొన్న తర్వాత ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 500 కోట్ల రూపాయల గ్రాస్‌గా నిర్ణయించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక కమల్, శంకర్ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు సహజంగానే పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యాయి. దాంతో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ కూడా తమిళం, ఓవర్సీస్‌లో భారీగా జరిగింది. ఈ సినిమా సుమారుగా 25 కోట్ల రూపాయల కలెక్షన్లు ముందస్తు బుకింగ్ వల్లే జరిగాయి. దాంతో ఈ మూవీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు.

ఇక దక్షిణాదిలో ఇండియన్ 2 సినిమాకు భారీగా తొలి రోజు కలెక్షన్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. తమిళంలో 18 కోట్ల రూపాయలు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, కర్ణాటక, హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు. ఇండియాలో ఈ సినిమా 22 కోట్ల నెట్, 26 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా మూవీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 32 కోట్ల గ్రాస్, 16 కోట్లు కరెంట్ బుకింగ్ రూపంలో వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో కలిపి సుమారుగా ఈ చిత్రం 50 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను తొలి రోజు నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Read more about: indian 2 prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X