Indian 2 Day 11 Collections: ఇండియన్ 2పై కోలుకోలేని దెబ్బ.. ఎన్ని కోట్ల నష్టమంటే?

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, విశ్వ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించలేకోపోతున్నది. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ తదితరులు నటించారు. భారీ ప్రమోషన్స్ మధ్య ఈ చిత్రం జూలై 12వ తేదీన రిలీజైంది. అయితే ఈ సినిమా తొలి రోజు భారీగా కలెక్షన్లు కొనసాగించినప్పటికీ.. ఆ జోష్‌ను కొనసాగించలేకపోయింది. ఇక ఈ సినిమా గత 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

28 ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఇండియన్ 2 మూవీ తొలి రోజు ఇండియాలో 26 కోట్ల రూపాయల నికరంగా, ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తొలి రోజు ఈ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చిన రెండో రోజు 18 కోట్లకుపైగా, 3వ రోజు 16 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత ఈ సినిమా భారీగా పడిపోయింది.

Indian 2 Day 11 Box Office Collections Worldwide Kamal Haasan movie joins 100 Crore Club

ఇక ఇండియన్ 2 సినిమా తొలివారం ముగిసే సమయానికి 70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తమిళంలో 49 కోట్లు, హిందీలో 6 కోట్లు, తెలుగులో 17 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక 8వ రోజు 1.5 కోట్లు, 9వ రోజు 1.8 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ ఇండియాలో 73 కోట్లుకుపైగా రెవెన్యూను రాబట్టింది.

అయితే ఈ సినిమా అనూహ్యంగా 10వ రోజు ఆదివారం భారీగా వసూళ్లు రాబట్టింది. తమిళంలో 1.5 కోట్ల రూపాయలు, తెలుగులో 60 లక్షలు వసూలుచేసింది. దాంతో ఈ సినిమా 2.1 కోట్లు తెలుగు, తమిళంలో వసూలు చేసింది. ఇక హిందీలో ఈ చిత్రం 40 లక్షలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 2.5 కోట్లు నికరంగా, 3 కోట్లు గ్రాస్‌తో వరల్డ్ వైడ్ ఈ సినిమా 5.5 కోట్లు వసూలు చేసింది. 11 రోజు ఈ సినిమా 1.5 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Indian 2 Day 11 Box Office Collections Worldwide Kamal Haasan movie joins 100 Crore Club

ఇండియన్ 2 సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో 73 కోట్ల రూపాయలు నికరంగా, 89 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో 50 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 140 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.

ఇంకా ఇండియన్ 2 సినిమా సుమారుగా 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 600 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ఆ రేంజ్ కలెక్షన్లు రాబట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సినిమా కనీసం 150 కోట్లకుపైగా నష్టాలతో ముగిసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: indian 2 prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X