Indian 2 Day 2 Collections: శంకర్ టార్గెట్ 600 కోట్లు.. కమల్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

విశ్వ నటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సుభాస్కరన్ నిర్మించిన చిత్రం ఇండియన్ 2. సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమా జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేసింది? రెండో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉంది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

ఇండియన్ 2 సినిమా తెలుగులో భారతీయుడు 2, హిందీలో హిందూస్థానీ పేరుతో రిలీజైంది. ఈ సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే లాభాల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.

Indian 2 Day 2 Expected Box Office Collections Worldwide Kamal Haasan movie registed decent openings

ఇండియన్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 3 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 90 లక్షలు, ఉత్తరాంధ్రలో 90 లక్షల వసూలు చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో 50 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 30 లక్షలు, గుంటూరు జిల్లాలో 70 లక్షలు, కృష్ణా జిల్లాలో 50 లక్షలు, నెల్లూరులో 25 లక్షలు రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం సుమారుగా 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ఇండియా వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 18 కోట్ల గ్రాస్ వసూళ్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియా 26 కోట్ల గ్రాస్, 22 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. హిందీలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Indian 2 Day 2 Expected Box Office Collections Worldwide Kamal Haasan movie registed decent openings

ఇక ఇండియా 2 రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 25 కోట్ల రూపాయల గ్రాస్, హిందీలో 2.5 కోట్ల గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 85 నుంచి 90 కోట్ల రూపాయలు వసూలు చేసుందని పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: indian 2 prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X