Indian 2 Day 3 Collections: 100 కోట్లు కొల్లగొట్టిన ఇండియన్ 2.. డిజాస్టర్ టాక్‌లోను కమల్ మూవీకి ఎన్ని కోట్లంటే

విలక్షణ నటుడు, దేశం గర్వించ దగిన సినీ ప్రముఖుడు కమల్ హాసన్, సంచలన చిత్రాలకు దర్శకత్వం వహించిన శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్ 2 (భారతీయుడు 2) సినిమా డిజాస్టర్ ట్రాక్‌ నడుమ తొలివారాంతం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇండియన్ 2 సినిమాను టాప్ యాక్టర్లు, అలాగే టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తో రూపొందించారు. ధాంతో ఈ సినిమాను 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. 28 ఏళ్ల తర్వాత ఇండియన్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఉండటంతో దేశవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ముందుకు సాగుతున్నది.

Indian 2 Day 3 Box Office Collections Worldwide Kamal Haasan movie joins 100 Crore Club

కమల్ హాసన్ నటించిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు కావడంతో తొలి రోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో వచ్చాయి. తమిళనాడులో ఈ సినిమా 18 కోట్ల రూపాయలు, తెలుగులో 8 కోట్ల రూపాయలు, హిందీలో 1.5 కోట్లు వసూలు చేసింది. దాంతో తొలి రోజు ఇండియాలో 27 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

ఇక 2వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నెగిటివ్ టాక్‌లోను స్టడీగా కలెక్షన్లు రాబట్టింది. తమిళంలో 14 కోట్ల రూపాయలు, తెలుగులో 3.5 కోట్ల రూపాయలు, హిందీలో 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 19 కోట్ల రూపాయలు వసూలు, ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది..

Indian 2 Day 3 Box Office Collections Worldwide Kamal Haasan movie joins 100 Crore Club

ఇదిలా ఉంటే.. మూడో రోజు విషయానికి వస్తే.. ఆదివారం కావడంతో రెండో రోజు కంటే ఎక్కువగానే కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 3వ రోజు 22 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేశారు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని పేర్కొన్నారు.

శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇండియాలో 65 కోట్లకుపైగా గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడమే కాకుండా డిజాస్టర్ టాక్‌తోను 100 కోట్ల క్లబ్‌లో చేరడం ట్రేడ్ వర్గాలను కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తొలివారాంతం తర్వాత కూడా ఈ సినిమా ఇదే ఊపును కొనసాగిస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

More from Filmibeat

Read more about: indian 2 prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X