Indian 2 Day 5 Collections: భారీ నష్టాల దిశగా ఇండియన్ 2.. 5వ రోజు ఎన్ని కోట్లంటే?

భారీ అంచనాలతో వచ్చిన ఇండియన్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతున్నది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నది. 28 ఏళ్ల క్రితం రిలీజైన ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ పేలవమైన కలెక్షన్లు సాధిస్తున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ రూపొందించిన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇండియన్ 2 సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. మొత్తంగా ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలు. ఇండియన్ 2 కోసం 300 కోట్లు ఖర్చు పెట్టగా, ఇండియన్ 3 కోసం 200 కోట్లు ఖర్చుపెట్టారు అనే విషయం ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపుగా 600 కోట్ల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

Indian 2 Day 5 Box Office Collections Worldwide Shankar Movie struggling at GBOC

ఇండియన్ 2 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా ఉండటంతో తొలి రోజు భారీగానే కలెక్షన్లు రాబట్టింది. తమిళనాడులో 18 కోట్లకుపైగా, కన్నడ, హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా 26 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ఇండియన్ 2 సినిమా 2వ రోజు ఇండియాలో 22 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మూడో రోజు ఇండియాలో 20 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే 4వ రోజు ఈ సినిమా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఇండియాలో 4 కోట్ల రూపాయల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 4 రోజుల్లో 118 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Indian 2 Day 5 Box Office Collections Worldwide Shankar Movie struggling at GBOC

ఇండియన్ 2 చిత్రం 5వ రోజున తమిళంలో 2 కోట్ల రూపాయలు, హిందీలో 50 లక్షలు, తెలుగులో 70 లక్షలు, కన్నడలో 50 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 5వ రోజు ఇండియాలో 4.2 కోట్ల వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 6 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో ఈ మూవీ 67 కోట్లకుపైగా నికరంగా, 78 కోట్ల గ్రాస్ వసూళ్లు, ఓవర్సీస్‌లో 52 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా గత 5 రోజుల్లో 130 కోట్ల రూపాయల గ్రాస్ నమోదు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా భారీగా వసూళ్లు రాబట్టాల్సిన అవసరం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Read more about: indian 2 prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X