Indian 2 Day 6 Collections: ఇండియన్ 2 కలెక్షన్లు దారుణంగానే.. శంకర్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

ఇండియన్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతున్నది. గత ఐదు రోజుల్లో కొనసాగుతున్న విధంగానే వసూళ్లను రాబడుతున్నది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. కమల్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీ భారీ నష్టాలతోనే ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇండియన్ 2 సినిమా గత 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లో 19 కోట్ల రూపాయలు, తమిళనాడులో 39 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 8 కోట్ల రూపాయలు, కేరళలో 5 కోట్ల రూపాయలు, హిందీలో 6 కోట్ల రూపాయల నికర వసూళ్లను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 76 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Indian 2 Day 6 Box Office Collections Worldwide Shankar Movie struggling at GBOC

ఇక 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియన్ 2 మూవీ కలెక్షన్లను మెరుగు పరుచుకోలేకపోయింది. ఈ సినిమా తమిళంలో 2.15 కోట్ల రూపాయలు, ఆంధ్ర, నైజాంలో 70 లక్షల రూపాయలు, హిందీ, కన్నడ చిత్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 4 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 80 కోట్ల రూపాయలు ఇండియాలో రాబట్టింది.

ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం కొంత మెరుగైన వసూళ్లను రాబట్టింది. గత 5 రోజుల్లో 41 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఆరో రోజున మరో 50 లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 6 రోజుల్లో 41.5 కోట్ల నికర వసూళ్లు, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.

Indian 2 Day 6 Box Office Collections Worldwide Shankar Movie struggling at GBOC

ఇక ఇండియన్ 2 ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీలో 6.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 130 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. తొలివారం తర్వాత ఈ కలెక్షన్ల వేగం మరింత ఆగిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక ఇండియన్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 600 కోట్ల గ్రాస్ కలెక్షన్ల లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం ప్రస్తుతం 130 కోట్లు మాత్రమే నమోదు చేసింది. దాంతో ఈ సినిమా భారీ నష్టాల్లో ముగిసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: indian 2 prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X