Indian Box Office 2025 Report: 6 నెలల్లో 5257 కోట్ల కలెక్షన్లు.. ఎన్ని హిట్స్, ఎన్ని ఫట్స్?

భారతీయ సినిమా పరిశ్రమలో 2025 సంవత్సరంలో అర్ధ భాగం ముగిసింది. అయితే తెలుగు, మలయాళం భాషలు తప్పా.. పెద్దగా సినిమా ఇండస్ట్రీలో హిట్స్ కొట్టిన దాఖలాలు కనిపించలేదు. బాలీవుడ్, తమిళ, కన్నడ సినిమా రంగాల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. గత ఆరు నెలల కాలంలో సినిమా పరిశ్రమలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఎన్ని చిత్రాలు ఇండస్ట్రీకి అండగా నిలిచాయి. ఈ ఆరు నెలల కాలంలో ఎంత మొత్తం వసూలైందని సాక్ నిల్క్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

2025 జనవరి నుంచి జూన్ మాసం ముగిసే సమయానికి మొత్తం 200 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అత్యధికంగా తమిళంలో 33 సినిమాలు, ఆ తర్వాత మలయాళంలో 31 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తెలుగులో 27 సినిమాలు విడుదల కాగా, కన్నడలో 26 చిత్రాలు, హిందీలో 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంగ్లీష్ భాషా చిత్రాలు 16, గుజరాతీ 10, మరాఠీ 10, బెంగాళీ 13, పంజాబీ 6, అస్సామీ భాషలో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Indian Box Office 2025 Half Yearly Report

గత 6 నెలల్లో రిలీజైన సినిమాల్లో 1 చిత్రం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 3 చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా, 3 సినిమాలు సూపర్ హిట్స్‌గా, 5 చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. మిగితావన్నీ యావరేజ్, బిలో యావరేజ్, డిజాస్టర్లుగా నిలిచాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

హిందీ భాషలో భూల్ చుక్ మాఫ్ 85 కోట్లు, జాట్ 104 కోట్ల, కేసరి 2 మూవీ 110 కోట్లు, సితారే జమీన్ పర్ 147 కోట్లు, రైడ్ 2 206 కోట్లు, హౌస్‌ఫుల్ 287 కోట్లు, ఛావా 716 కోట్ల రూపాయలతో హిట్లుగా నిలిచాయి. చావా చిత్రం బాలీవుడ్‌కు దాదాపు ఊపిరిపోసినంత పనిచేసింది. తాజాగా రైడ్ 2, సితారే జమీన్ పర్, కేసరీ 2, జాట్ చిత్రాలు పర్వాలేదనిపించాయి.

తెలుగు సినిమా రంగం విషయానికి వస్తే.. సంక్రాంతి బరిలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 255 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. గేమ్ ఛేంజర్ చిత్రం 186 కోట్ల రూపాయలు వసూలు చేసినప్పటికీ.. బడ్జెట్ పరంగా డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత హిట్ జాబితాలో నిలిచిన వాటిలో డాకూ మహారాజ్ 126 కోట్ల, హిట్ 3 మూవీ 119 కోట్లు, కుబేరా 123 కోట్లు, తండేల్ చిత్రం 90 కోట్లు, మ్యాడ్ స్క్వేర్ 70 కోట్లు, కోర్టు 57 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీకి అండగా నిలిచాయి.

Indian Box Office 2025 Half Yearly Report

తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ 250 కోట్లు, డ్రాగన్ చిత్రం 150 కోట్లు, విదాముయార్చి 135 కోట్లు, టూరిస్ట్ ఫ్యామిలీ 90 కోట్ల రూపాయలు, రెట్రో 97 కోట్లు, మధగజ రాజా 56 కోట్లు, థగ్ లైఫ్ 97 కోట్లు, వీర ధీర సూరన్ 65 కోట్లు, కుటుంబస్థాన్ 27.5 కోట్లు వసూలు చేశాయి. రెట్రో, థగ్ లైప్ చ ిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

మలయాళ సినిమా రంగం విషయానికి వస్తే.. తుడరం సినిమా ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 235 కోట్ల రూపాయలు, ఎంపురాన్ చిత్రం 266 కోట్ల రూపాయలు, ఆలపుళ జింఖానా 70 కోట్లు, రేఖాచిత్రం 57 కోట్లు, ఐడెంటిటీ 17 కోట్లు చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. అయితే కన్నడలో టాప్ హీరోకు సంబంధించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దాదాపు రిలీజైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

ఇండియాలో మొత్తం ఇప్పటి వరకు 828 సినిమాలు రిలీజ్ అయ్యాయి. హిందీలో 121 సినిమాలు, కన్నడలో 123 సినిమాలు, మలయాళంలో 110, తమిళంలో 139, తెలుగులో 142, మరాఠీలో 53, ఇంగ్లీష్‌లో 88 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద 5257 కోట్ల రూపాయల గ్రాస్, 4643 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X