సౌత్ సినిమాల తరువాతే పఠాన్.. టాప్ ఫుట్‌ఫాల్స్ నమోదు చేసిన సినిమాలు.. పెట్టింది ఎంత వచ్చింది ఎంత?
ఇటీవల కాలంలో సినిమాల మార్కెట్ తగ్గిపోతుంది అని అనుకుంటున్న తరుణంలో కొన్ని సినిమాలు ఊహించని స్థాయిలో మళ్లీ మార్కెట్ వాల్యూని పెంచుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ అంచనాలు కూడా ఊహలకందని స్థాయిలో పెరిగిపోయాయి. దర్శకులు హీరోలు కూడా అదే తరహాలో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఇండియాలో అత్యధిక ఫుట్ ఫాల్ కలిగిన సినిమాల లిస్టులో పటాన్ కూడా చేరింది. అయితే అది సౌత్ ఇండియన్ సినిమాల తర్వాతనే నిలుస్తోంది. ఇక ఆ టాప్ త్రీ సినిమాల బడ్జెట్ ఎంత? అలాగే వరల్స్ వైడ్ గా వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే...

అంచనాలు కూడా మారిపోయాయి
ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్ బడ్జెట్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఎక్కువ స్థాయిలో వచ్చేవి. కానీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మార్కెట్ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది. నార్త్ ఆడియన్స్ కూడా సౌత్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ముఖ్యంగా బాహుబలి వచ్చిన తర్వాత ప్రేక్షకులు అంచనాలు కూడా మారిపోయాయి. ఇక చాలా రోజుల తర్వాత పఠాన్ సినిమా బాలీవుడ్ కు కొంత ఊపిరి పోసింది అనే చెప్పాలి.

పఠాన్ తో న్యూ రికార్డ్
షారుక్ ఖాన్ నటించిన పటాన్ సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. సక్సెస్ లేక దాదాపు 5దేళ్లపాటు వెండితెరపై హీరోగా కనిపించని షారుక్ ఖాన్ మొత్తానికి పఠాన్ సినిమాతో అయితే మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాకుండా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో పఠాన్ సినిమా ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 970 కోట్లు వచ్చాయి.

నెంబర్ వన్ మూవీగా బాహుబలి 2
ఇక అత్యధికంగా ఫుట్ ఫాల్స్ నమోదైన సినిమాల వివరాలలోకి వెళ్తే బాహుబలి సెకండ్ పార్ట్ ను చాలా ఎక్కువ మంది చూశారు. దాదాపు 10.82 కోట్ల ఫుట్ ఫాల్స్ నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు 250 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయగా ప్రపంచవ్యాప్తంగా 1831 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇండియా లో ఇప్పటివరకు అత్యధిక మంది చూసిన సినిమాల్లో బాహుబలి అగ్రస్థానంలో కొనసాగుతోంది.

KGF 2.. రెండవ స్థానంలో..
ఇక కన్నడ మూవీ KGF 2 కూడా రికార్డు స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 1235 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న రెండవ సినిమాగా కొనసాగుతున్న ఈ సినిమాకు ఇండియాలో మొత్తంగా 5.30 కోట్ల ఫుట్ ఫాల్స్ నమోదు అయ్యాయి

3వ స్థానంలో పఠాన్
ఇక ఇటీవల అనేక రకాల కాంట్రవర్సీల నడుమ విడుదలైన పటాన్ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమా 250 కోట్లు బడ్జెట్ తో రూపొంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 970 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇండియా మొత్తంలో కూడా దాదాపు ఈ సినిమాకు మూడు కోట్ల ఫుట్ ఫాల్స్ నమోదు అయ్యాయి. ఇప్పటివరకు బాలీవుడ్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఇది నిలిచింది.


Click it and Unblock the Notifications











