Don't Miss!
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
Indian Biggest Hits: అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో టాప్ 3లో KGF 2.. RRR రికార్డ్ బ్రేక్!
ఇండియన్ సినిమా ప్రపంచంలో గడిచిన ఐదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి అనే చెప్పాలి. ముఖ్యంగా ఆడియన్స్ అభిరుచి కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు కేవలం హిందీ సినిమాలు మాత్రమే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలుగా ప్రపంచాన్ని ఆకర్షించేవి. కానీ ఇప్పుడు మాత్రం సౌత్ ఇండియన్ సినిమాలు కూడా అంతకుమించి అనేలా కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన కన్నడ చిత్రం కేజిఎఫ్ 2 ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో మూడవ స్థానంలో చోటు సంపాదించుకోవడం విశేషం. మొత్తానికి RRR సినిమా రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇక టాప్ ఫైవ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
టార్గెట్ 500కోట్లు
ఇండియాలో గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద మార్కెట్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతుంది. 100 కోట్ల నుంచి మూడు వందల కోట్లకు రావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇక ఆ తరువాత ఐదు వందల కోట్ల అనంతరం వెయ్యి కోట్లు అనేది ఇప్పుడు ఒక ప్రత్యేకమైన టార్గెట్ లుగా మారాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఇండియా లెవెల్ లో విడుదలైతే తప్పకుండా 500 కోట్లు దాటుతుంది అని అందరిలో ఒక నమ్మకం అయితే ఏర్పడింది.
నెంబర్ వన్ దంగల్
ఇక మరికొన్ని సినిమాల్లో అయితే ఈజీగా 1000 కోట్ల వసూళ్లను సాధించడానికి దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాల్లో అమీర్ ఖాన్ దంగల్ సినిమా టాప్ లిస్టులో ఉంది. 2016లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1924 కోట్ల కలెక్షన్స్ తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
బాహుబలి 2
ఇక రెండవ స్థానంలో బాహుబలి సినిమా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా 2017 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1749 కోట్లు. బాహుబలి 2 ఆ రేంజ్లో సక్సెస్ అవుతుంది అని ఎవరూ కూడా ఊహించలేకపోయాడు.
టాప్ 3లో KGF 2
ఇక మొత్తానికి ఈ ఏడాది వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2, RRR రికార్డును బ్రేక్ చేసింది. ఈ సినిమా ఇటీవల 1000 కోట్ల వసూళ్లతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మొత్తంగా ఈ సినిమా రూ.1129 కోట్ల కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాల్లో మూడో స్థానంలో చోటు దక్కించుకుంది. ఇంకా కలెక్షన్స్ ప్రవాహం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ సంఖ్య ఎక్కడి వరకు వెళుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
4వ స్థానంలో RRR
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినటువంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR సినిమా 1125.1 కోట్ల కలెక్షన్స్ అందుకుని ఇండియన్ టాప్ సినిమాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. మొన్నటి వరకు ఈ సినిమా 3వ స్థానంలో ఉండగా ఇప్పుడు కేజిఎఫ్ 2 ఈ రికార్డును బ్రేక్ చేయడంతో నాలుగో స్థానంలోకి పడిపోయింది.
5వ స్థానంలో బజరంగీ భాయిజాన్
ఇక ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను అందుకున్న ఇండియన్ సినిమాల్లో బజరంగీ భాయిజాన్ 5వ స్థానంలో కొనసాగుతోంది. 2015 లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 858 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకొని అప్పట్లో నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించింది. ఇక ఇప్పుడు టాప్ ఇండియన్ సినిమాల్లో 5వ స్థానంలో కొనసాగుతోంది.