Indiana Jones Collections ఇండియానా జోన్స్‌కు భారీ కలెక్షన్లు.. ఇండియాలో ఎన్ని కోట్లంటే?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఇండియానా జోన్స్ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ ఇండియాలో రిలీజైంది. హారిసన్ ఫోర్డ్, ఆంటానియో బ్యాండ్రియాస్, టాబీ జోన్స్, బాయ్డ్ హాల్ బ్రూక్ తదితరులు నటించారు. జేమ్స్ మ్యాన్ గోల్డ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా, బడ్జెట్ తదితర విషయాల్లోకి వెళితే..
ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ చిత్రం బడ్జెట్ విషయానికి వస్తే.. 295 మిలియన్ డాలర్ల వ్యయంతో అంటే భారతీయ కరెన్సీలో 2400 కోట్లకుపైగా వయయంతో రూపొందింది. ఇప్పటి వరకు రూపొందిన సీక్వెల్స్‌లో ఈ చిత్రానిదే భారీ బడ్జెట్ అని నిర్మాతలు చెప్పారు.

ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ సినిమా థియేటర్ కౌంట్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 10 వేలకుపైగా స్క్రీన్లలో రిలీజైంది. ఈ సినిమా ఆక్యుపెన్సీ కూడా భారీగానే నమోదైంది. ఇండియాలో పెద్దగా ఈ సినిమాకు స్పందన లభించలేదు. భారత్‌లో ఓవరాల్‌గా 15 నుంచి 25 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ ప్రీమియర్లు చాలా చోట్ల బుధవారం మొదలయ్యాయి. ఇక యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, కొరియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.
ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ చిత్రం అమెరికా, కెనడాలో భారీ ఒపెన్సింగ్స్ నమోదు చేసింది. ఈ సినిమా నార్త్ అమెరికాలో 40 మిలియన్ల డాలర్లను తొలివారాంతంలో నమోదు చేయవచ్చని చెబుతున్నారు. అమెరికేతర దేశాల్లో 80 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి వారాంతంలో 120 మిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇక ఇండియాలో పేలవంగా తొలి రోజు కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని పేర్కొంటున్నారు. ఇక ఈ చిత్రానికి బాలీవుడ్, తెలుగు సినిమాల నుంచి భారీ పోటీ ఏర్పడింది. దాంతో తక్కువగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











