Indiana Jones Collections.. ఇండియాలో షాకింగ్‌గా కలెక్షన్లు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లంటే?
ఇండియానా జోన్స్: ది డయల్ ఆఫ్ డెస్టినీ చిత్రం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియానా జోన్స్ సిరీస్‌లో చివరి చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. హ్యారీసన్ ఫోర్డ్, ఫోబే వాలర్ బ్రిడ్జ్, మాడ్స్ కిక్కెల్సన్, ఆంటోనియో బండేరాస్, బాడీ హల్బ్రూక్, థామస్ క్రెచ్ మ్యాన్, కరెన్ అలెన్, మార్క్ కిలీన్ తదితరులు నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ చిత్రం బడ్జెట్ విషయానికి వస్తే.. 295 మిలియన్ డాలర్ల వ్యయంతో అంటే భారతీయ కరెన్సీలో 2400 కోట్లకుపైగా వయయంతో రూపొందింది. ఇప్పటి వరకు రూపొందిన సీక్వెల్స్‌లో ఈ చిత్రానిదే భారీ బడ్జెట్ అని నిర్మాతలు చెప్పారు. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 వేలకుపైగా స్క్రీన్లలో రిలీజైంది.

భారత్‌లో ఇండియానా జోన్స్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ 1.5 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. హిందీ వెర్షన్ 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 2 కోట్లు వసూలు చేసింది.
ఇక రెండో రోజు ఇండియానా జోన్స్: ది డయల్ ఆఫ్ డెస్టినీ వసూళ్ల వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీష్ వెర్షన్ 1.15 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. హిందీ వెర్షన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 45 లక్షల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం రెండో రోజున 1.60 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది.
ఇండియానా జోన్స్ మూడో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. వీకెండ్ కావడంతో కొంత మెరుగైన వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా మూడో రోజు 1.5 కోట్లు ఇంగ్లీష్ వెర్షన్, 40 లక్షలు హిందీ వెర్షన్ వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 1.9 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ప్రీమియర్ల ద్వారా 7.5 మిలియన్ డాలర్లు, శుక్రవారం 24 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తొలి వారం ముగిసే సమయానికి 65 మిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











