Indra 4K Collections: కలెక్షన్లతో దుమ్ముదులిపిన ఇంద్ర.. 2 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
తెలుగు సినిమా ప్రపంచంలో అగ్ర హీరోలు నటించిన రీ రిలీజ్‌ల పండుగ ఘనంగా సాగుతున్నది. ఇటీవల కాలంలో పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం వల్ల అభిమానుల్లో జోష్ పంచేందుకు ఆయ హీరోల హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. అలాంటి చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూళ్లు వస్తున్నాయి. ఇటీవల ఖుషి, సింహాద్రి, చెన్నకేశవరెడ్డి, మురారీ చిత్రాలు భారీ వసూళ్లు సాధించాయి. తాజాగా ఇంద్ర మూవీని రిలీజ్ చేయగా భారీ కలెక్షన్లను రాబడుతున్నది. ఈ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
2002 సంవత్సరంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఇంద్ర సినిమాను తాజాగా మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఆర్తీ అగర్వాల్, సొనాలి బింద్రే నటించిన ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ బీ గోపాల్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత సీ అశ్వినీదత్ సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం అప్పట్లో 55 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం రేపింది.

అయితే ఇప్పటి ఇన్ఫ్లేషన్ ప్రకారం.. అంటే టికెట్ల రేట్లు, థియేటర్ల పరిధిని బట్టి చూస్తే ఈ సినిమా కలెక్షన్ల విలువ సుమారుగా 400 కోట్లకుపైగానే ఉంటుంది అని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. ఇలాంటి విజయాన్ని అందుకొన్న ఇంద్ర సినిమా రీ రిలీజ్ కాగానే వయసుతో సంబంధం లేకుండా ఆ తరం, ఈ తరం యువకులు సినిమాకు పోటెత్తారు. దాంతో ఈ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లు సాధించింది.
ఇంద్ర చిత్రం తొలి రోజున సంచలన రీతిలో కలెక్షన్లు రాబట్టాయి. ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణలో కలిపి మొత్తం 2 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటక, ఓవర్సీస్‌లోని పలు ప్రాంతాల్లో కలిపి ఈ చిత్రం 3.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక రెండో రోజు కూడా ఇంద్ర సినిమాకు గట్టిగానే కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల గ్రాస్, ఓవర్సీస్‌లో కలిపి మరో 50 లక్షల గ్రాస్ వసూళ్లతో మొత్తం 1 కోటి రూపాయలను కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 4.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











