Box Office హీరోగా మారిన కమెడియన్.. కోట్ల కలెక్షన్లు కురిపిస్తున్న తమిళ సినిమా ఏంటో తెలుసా?

సినీ పరిశ్రమలో కమెడియన్లు, విలన్లు హీరోలుగా మారడం సర్వసాధారణమే. గతంలో తెలుగులో ఆలీ, బాబు మోహన్, సునీల్ లాంటి వాళ్లు, అలాగే తమిళంలో కూడా వడివేలు తదితరులు హీరోలుగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కోవలోకి కమెడియన్ సంతానం హీరోగా మారి నటించిన చిత్రం ఇంగా నాన్ థాన్ కుంగు చిత్రం విడుదలై మంచి స్పందన వస్తున్నది. మే 17వ విడుదలైన సినిమా బడ్జెట్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

ఇంగా నాన్ థాన్ కుంగు చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే.. హీరోయిన్‌గా ప్రియలయ, థంబి రామయ్య, వివేక్ ప్రసన్న, బాల శరవణన్, మునీష్ కాంత్ తదితరులు నటించారు. ఈ సినిమాను సుమారుగా 12 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా సుమారుగా 14 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తే.. బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Inga Naan Thaan Kingu Day 5 Box Office Collection Worldwide

సంతానం సినిమా నటించిన సినిమాకు చెన్నై, పాండిచ్చేరి, సలెం, వెల్లూరు, దిండిగల్, త్రివేండ్రమ్ ప్రాంతాల్లో మంచి స్పందన లభిస్తున్నది. ఈ ప్రాంతాల్లో సుమారుగా 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే బీ గ్రేడ్ హీరోలకు మించి ఈ సినిమా కలెక్షన్లు సాధించడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది.

ఆర్టిస్టుగా, కమెడియన్‌గా సంతానంకు ఉన్న ఇమేజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు 1 కోటి రూపాయలు, రెండో రోజు 1.20 కోట్లు, మూడో రోజు 1.5 కోట్లు, నాలుగో రోజు 70 లక్షలు వసూలు చేసింది. ఇక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కలిపి ఈ చిత్రం 1.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా గత నాలుగు రోజుల్లో 4.5 కోట్లు 4.5 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 5.75 కోట్లు వసూలు చేసింది.

Inga Naan Thaan Kingu Day 5 Box Office Collection Worldwide

ఇక ఇంగా నాన్ థాన్ కుంగు చిత్రం 5వ రోజున కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం తమిళనాడులో 70 లక్షల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 1 కోటి రూపాయలు వసూళ్లు సాధించింది.

ఇక 6వ రోజు ఈ సినిమా తమిళనాడులో 50 లక్షల రూపాయలు, అన్ని ప్రాంతాల్లో కలిపి 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో సినిమా 7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X