2500 కోట్ల బడ్జెట్.. ఓవర్సీస్‌లో సూపర్ హిట్.. ఇండియాలో డిజాస్టర్.. ఎన్ని వేల కోట్ల కలెక్షన్లంటే?
హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు వాల్డ్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై కెల్‌స్లే మాన్ దర్వకత్వంలో రూపొందిన అమెరికన్ యానిమేటెడ్ చిత్రం ఇన్‌సైడ్ అవుట్ 2 (Inside Out 2). మార్క్ నీల్సెన్ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలో అమీ పోచ్లెర్, మాయా హాకే, లిజా లపిరా, టోని హాలే తదితరులు భాగస్వామ్యమయ్యారు. కిడ్స్‌ను టార్టెట్‌గా చేసుకొని వచ్చిన ఈ చిత్రం జూన్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఇన్‌సైడ్ అవుట్ 2 సిసినిమాను అత్యంత సాంకేతిక విలువలతో యానిమేషన్ చిత్రంగా రూపొందించారు. ఈ మూవీ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ సినిమాకు సుమారుగా 300 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

ఇన్‌సైడ్ అవుట్ 2 (Inside Out 2) సినిమా విషయానికి వస్తే... భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో ఇండియాలో కలెక్షన్లు అంతగా పుంజుకోలేకపోయాయి.
ఇన్‌సైడ్ అవుట్ 2 (Inside Out 2 Collections) కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.65 కోట్ల రూపాయలు, మూడో రోజు 3.25 కోట్లు, నాలుగో రోజున 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 5వ రోజున ఈ చిత్రం 50 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 9.3 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఇంగ్లీష్ వెర్సన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో తొలి రోజు 1.25 కోట్లు, రెండో రోజు 2.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 2.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 1.2 కోట్ల రూపాయలు రాబట్టింది. మొత్తంగా ఇంగ్లీష్ వెర్షన్ 7.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. ఈ సినిమా హిందీలో 1.5 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.
ఇక అమెరికాలో ఈ సినిమాకు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. గత నాలుగు రోజుల్లో 175 మిలియన్ డాలర్లు ఉత్తర అమెరికాలో, ఓవర్సీస్‌లో 325 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే ఓవర్సీస్‌లో ఘనంగా వసూళ్లను నమోదు చేసినా. ఇండియాలో అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోతున్నది.


Click it and Unblock the Notifications











