14 రోజుల్లో 7000 కోట్ల కలెక్షన్లు.. ప్రభాస్ ‘కల్కి’ని సవాల్ చేస్తున్న మూవీ ఎంటో తెలుసా?

అమెరికన్ యానిమేటెడ్ మూవీ ఇన్‌సైడ్ అవుట్ 2 చిత్రం నార్త్ అమెరికా, ఓవర్సీస్ మార్కెట్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తున్నది. కేవలం 2 వారాల్లోనే ఈ చిత్రం 1 బిలియన్ డాలర్ల క్లబ్ చేరేందుకు రెడీ అవుతున్నది. ఈ చిత్రం మూడో వారంలో కూడా వసూళ్లపరంగా దూసుకెళ్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ డైరెక్టర్ కెల్‌స్లే మాన్ దర్వకత్వంలో రూపొందిన మార్క్ నీల్సెన్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు అమీ పోచ్లెర్, మాయా హాకే, లిజా లపిరా, టోని హాలే తదితరులు తమ సహకారం అందించారు. క్వాలిటీ విషయంలోరాజీ పడకుండా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌తో ఈ మూవీని సుమారుగా 300 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. సమ్మర్ వెకేషన్ టార్టెట్‌గా చేసుకొని వచ్చిన ఈ చిత్రం జూన్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.

Inside Out 2 inching towards 1 Billion Dollor Club Challenges Prabhas s Kalki 2898 AD at US Box Office
ఇన్‌సైడ్ అవుట్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండానే జర్నీని మొదలుపెట్టింది. దాంతో ఈ సినిమాకు అనూహ్యమైన కలెక్షన్లు నమోదు అయ్యాయి. దాంతో 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన అమెరికన్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడానికి సిద్దంగా ఉండటం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.
Inside Out 2 inching towards 1 Billion Dollor Club Challenges Prabhas s Kalki 2898 AD at US Box Office

ఇండియాలో ఇన్‌సైడ్ అవుట్ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం గత రెండు వారాల్లో హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో కలిపి 25 కోట్ల గ్రాస్, 20 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం వల్ల రిలీజ్ అయిన విషయమే చాలా మందికి తెలియకపోవడంతో వసూళ్లు రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఇన్‌సైడ్ అవుట్ 2 సినిమా ప్రస్తుతం రిలీజైన తెలుగు సినిమా కల్కి 2898 ఏడీ సినిమాకు యూఎస్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీగా నిలబడింది. ప్రభాస్ నటించిన కల్కి చిత్రం కూడా భారీగానే వసూళ్లను సాధిస్తున్నది. తొలి రోజు ఈ చిత్రం 5 మిలియన్ల డాలర్లను వసూలు చేసింది. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ భారీగానే ఉండే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X