Box Office: 7 రోజుల్లో 3800 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్న మూవీ ఏంటో తెలుసా?

అమెరికన్ యానిమేషన్ మూవీ ఇన్‌సైడ్ అవుట్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ఈ సినిమాను హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు వాల్డ్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌ రూపొందించింది. కెల్‌స్లే మాన్ దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మార్క్ నీల్సెన్ నిర్మాతగా వ్యవహరించారు. అమీ పోచ్లెర్, మాయా హాకే, లిజా లపిరా, టోని హాలే తదితరులు తమ సహకారం అందించారు. సమ్మర్, పిల్లలను టార్టెట్‌గా చేసుకొని వచ్చిన ఈ చిత్రం జూన్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమా అనూహ్యంగా కలెక్షన్లు రాబట్టడం సంచలనంగా మారింది. ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టుపై ఓసారి లుక్కేద్దాం.

యానిమేషన్ రంగంలో అత్యంత సాంకేతిక విలువలతో రూపొందిన ఇన్‌సైడ్ అవుట్ 2 సినిమాను మంచి క్వాలిటీతో రూపొందించారు. రాజీ పడకుండా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ సినిమాకు సుమారుగా 300 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Inside Out 2 movie 7 days Box Office Collection Worldwide here is complete GBOC report

ఇండియాలో ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా వచ్చిందనే కనీస సమాచారం లేకపోవడం వల్ల ప్రేక్షకులు థియేటర్‌ రాలేకపోతున్నారనే వాదన వినిపిస్తున్నది. ఈ సినిమా గత వారంలో రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 12 కోట్లు నికరంగా, 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమా కలెక్షన్ల కుంభవృష్టి కురుస్తున్నది. హాలీవుడ్‌లో టాప్ 15 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా అంచనాలకు భిన్నంగా సోమ, మంగళవారాల్లో రికార్డు కలెక్షన్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రముఖ క్రిటిక్ వెబ్ సైట్స్ మంచి రేటింగ్‌ను ఇవ్వడంతో కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి.

Inside Out 2 movie 7 days Box Office Collection Worldwide here is complete GBOC report
నార్త్ అమెరికాలో అంటే.. యూఎస్ఏ, కెనడాలో కలిపి ఈ చిత్రం 250 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా ఇండియన్ కరెన్సీలో 2100 కోట్ల రూపాయలను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా ఈ సినిమా అమెరికాలో స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నది.

ఇక అమెరికా యేతర దేశాల్లో కూడా ఇన్‌సైడ్ అవుట్ 2 చిత్రం కాసుల పంటను పండిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే 203 మిలియన్ డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో 1700 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇంకా ఈ సినిమా రికార్డు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇన్‌సైడ్ అవుట్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఈ చిత్రం ఇప్పటికే 450 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే ఈ సినిమా సుమారుగా 3800 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాను 2500 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా కలెక్షన్లు ఎక్కడ ఆగుతాయో.. వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X