Interstellar: 1400 కోట్ల బడ్జెట్..6500 కోట్ల కలెక్షన్లు.. ఇంటర్‌స్టెల్లార్ రీ రిలీజ్ వసూళ్లు ఎన్ని కోట్లంటే?
హాలీవుడ్‌లో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ఇంటర్‌స్టెల్లార్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించగా.. ఆయన సోదరుడు జోనాథన్ నోలన్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రంలో మాథ్యూ మెక్ కన్నాహ్, అన్నే హత్ వే, జెస్సికా చాస్టెయిన్, బిల్ ఇర్విన్, ఎలెన్ బ్రర్‌స్టెయిన్, మైఖేల్ కైన్ తదితరులు నటించారు. ఈ సినిమాను ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్, లిండా వోస్ట్ నిర్మించారు. పారామౌంట్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, లెజెండరీ పిక్చ్స్, సింకోపి ఇంక్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను 11 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఇంటెర్‌స్టెల్లార్ సినిమాను ప్రతిష్టాత్మకంగా, అత్యాధునిక సాంకేతికతతో గ్రాండ్‌గా నిర్మించారు. టెక్నాలజీ, నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను 165 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 1400 కోట్ల రూపాయలతో నిర్మించారు. 2014 నవంబర్ 7వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఏకంగా 748 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 6500 కోట్లకుపైగా కలెక్షన్లను వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది.

ఇండియాలో 2014 ఇంటెర్‌స్టెల్లార్ సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టింది. తొలి రోజు ఈ సినిమా 3 కోట్లకుపైగా వసూళ్లను, తొలివారం 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా సుమారుగా 75 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇంటెర్‌స్టెల్లార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా ఆదరణ సంపాదించుకొన్న నేపథ్యంలో ఇంటెర్‌స్టెల్లార్ 2 మూవీని రిలీజ్ చేయాలనే డిమాండ్ నోలన్ అభిమానుల నుంచి భారీగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాను మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్‌కు భారీగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇంటెర్‌స్టెల్లార్ సినిమా రీ రిలీజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి రోజు 2.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.75 కోట్ల రూపాయలు, 3వ రోజు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 3 రోజుల్లో 10.25 కోట్ల రూపాయలను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన కొత్త చిత్రాల కంటే ఈ సినిమా ఎక్కువగా వసూళ్లను రాబట్టడం చూస్తే.. ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఏమిటో అర్ధం అవుతున్నది. లవ్‌యప్పా, బ్యాడాస్ రవికుమార్ సినిమాల కంటే ఈ చిత్రం అధికంగా కలెక్షన్లనను నమోదు చేస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











