ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: ‘సైరా’కు లాభాలు రావాలంటే ఎంత వసూలు చేయాలో తెలుసా?

Recommended Video

Sye Raa Narasimha Reddy Total Business || 'సైరా' బంపర్ ఆఫర్ |

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మన సినిమాల హవా కనిపిస్తోంది. కొద్దిరోజులుగా సాహో సందడి చేస్తుండగా.. ఇటీవలే సైరా: నరసింహారెడ్డి హడావిడి కూడా మొదలైంది. దీంతో అందరి దృష్టి టాలీవుడ్‌పై పడింది. సాహో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా.. సైరా మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ప్రమోషన్ షురూ చేసేశారు

ప్రమోషన్ షురూ చేసేశారు

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే ‘సైరా' మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ గత నెల 14న విడుదల చేసింది. దీనికి భారీ స్పందన వచ్చింది. అలాగే, ‘సైరా' సినిమా టీజర్‌ను ఆగస్టు 20న వదిలారు. దీనికి కూడా విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత ముంబైలో ప్రెస్‌మీట్ కూడా నిర్వహించారు. దీనికి బడా స్టార్లు హాజరైన విషయం తెలిసిందే.

 హిందీలో కూడా భారీ స్థాయిలో..

హిందీలో కూడా భారీ స్థాయిలో..

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘సైరా'ను హిందీలో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. హిందీ విడుదల హక్కులను ప్రముఖ బాలీవుడ్ హీరో, నిర్మాత ఫర్హాన్ అక్తర్ కొనుగోలు చేశారు. ఆయన, రితేష్ సిద్వానికి చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్, అనిల్ తాదానికి చెందిన ఎఎ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ‘సైరా' హిందీ హక్కులను కొనుగోలు చేశాయి. ఈ మేరకు ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ ఇటీవల ట్వీట్ చేసింది. అంతేకాదు, ‘సైరా'లోని పాత్రలను పరిచయం చేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేసింది.

ఎవరెవరు కొన్నారు

ఎవరెవరు కొన్నారు

తెలుగు రాష్ట్రాల్లో సైరా బిజినెస్ భారీగా సాగింది. రెండు రాష్ట్రాల్లోనే ప్రతిష్టాత్మకమైన నైజాం రైట్స్‌ను దిల్ రాజు రూ. 30 కోట్లకు దక్కించుకున్నారు. అలాగే, సీడెడ్‌ రైట్స్ రూ. 22 కోట్లకు ఎన్వీ ప్రసాద్, నెల్లూరు రైట్స్ రూ. 5.20 కోట్లకు హరి పిక్చర్స్, కృష్ణా రైట్స్ రూ. 9.60 కోట్లకు జీ3 ఫిల్మ్స్, గుంటూరు రైట్స్ రూ. 11.50 కోట్లకు యూవీ క్రియేషన్స్, వైజాగ్ రైట్స్ రూ. 14.40 కోట్లకు క్రాంతి ఫిల్మ్స్, ఈస్ట్ రూ. 10.40 కోట్లకు విజయలక్ష్మీ ఫిల్మ్స్, వెస్ట్ రూ. 9.20 కోట్లకు ఉషా పిక్చర్స్ సొంతం చేసుకున్నాయి.

లాభాలు రావాలంటే..

లాభాలు రావాలంటే..

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో సైరా: నరసింహారెడ్డి రూ. 112.30 కోట్లకు అమ్ముడు పోయింది. అంటే ఈ సినిమాకు తెలుగులోనే రూ. 120 కోట్లు వసూలు చేస్తే లాభాల్లోకి వస్తుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌తో ఈ వసూళ్లు సాధ్యం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయని అంటున్నారు. అలాగే, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమేజాన్ ప్రైమ్ రూ. 40 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

సైరా గురించి..

సైరా గురించి..

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X