Remuneration: ప్రభాస్, అల్లు అర్జున్‌లో టాప్ ఎవరు? ఐకాన్‌స్టార్, రెబల్‌స్టార్‌లో ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికంటే?

భారతీయ సినిమా పరిశ్రమ అంటే బాలీవుడ్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. హిందీ స్టార్ హీరోలే అత్యధికంగా రెమ్యునరేషన్లు తీసుకొని ఇండస్ట్రినీ రూల్ చేస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాహుబలి మూవీ ఇండియన్ సినిమా పరిశ్రమ లెక్కలను మార్చేసింది. రాజమౌళి క్రియేట్ చేసిన బాక్సాఫీస్ సునామీ తర్వాత ఫోకస్, డామినేషన్ అంతా తెలుగు సినిమా ఇండస్ట్రీ కొనసాగిస్తున్నది. అయితే తాజా పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్, అల్లు అర్జున్ టాప్ రెమ్యునరేషన్ తీసుకొంటారనే చర్చ జరుగుతున్నది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు టాప్ అనే విషయానికి వస్తే..

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరోగా ప్రభాస్ మారిపోయారు. ఆ తర్వాత వచ్చి బాహుబలి 2, సాహో, సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను నమోదు చేసింది. దాంతో ఆయన రెమ్యునరేషన్ అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే ఆయన పారితోషికం ఎంత అనేది ఎవరికి తెలియకుండానే ఉంది.

Is Allu Arjun tops Prabhas taking 300 Crores for Pushpa 2 How rebel star takes salary for Kalki 2898 AD

అయితే ఇటీవల హోంబలే బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ రూపొందించే మూడు సినిమాల్లో నటించేందుకు ప్రభాస్‌తో ఒప్పందం జరిగింది. అయితే మూడు సినిమాలకు సుమారుగా 600 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అనే వార్త మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ఒక్కో సినిమాకు 200 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు తేల్చేశారు. దాంతో ఇండస్ట్ట్రీలో ఎవరు టాప్ అనే విషయంపై సోషల్ మీడియాలో అభిమానులు గొడవ మొదలైంది.

అయితే అల్లు అర్జున్‌తో ప్రభాస్ పోల్చుతూ వారి వారి అభిమానులు మధ్య కామెంట్స్ కొనసాగుతున్నాయి. వాస్తవానికి పుష్ప ది రైజ్ సినిమాకు ముందు అల్లు అర్జున్‌కు పెద్దగా రెమ్యునరేషన్ ఒకే రేంజ్‌లో ఉండేది. కానీ పుష్ప 1 సృష్టించిన హంగామాతో ఆయన రేంజ్ పది రెట్లు పెరిగిపోయింది. అయితే మొదట అనుకొన్న దానికంటే పుష్ప 2 ది రూల్ పై పెరిగిన అంచనాలను తగినట్టుగానే ఆయన రెమ్యునరేషన్ పెరిగిందనే ఇండస్ట్రీ వర్గాల టాక్.

Is Allu Arjun tops Prabhas taking 300 Crores for Pushpa 2 How rebel star takes salary for Kalki 2898 AD

అయితే పుష్ప 2 సినిమా కోసం భారీగా పారితోషికాన్ని ఐకాన్ స్టార్ తీసుకొంటున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే పుస్ప ది రూల్ కోసం అల్లు అర్జున్ సుమారుగా 300 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకొంటున్నారు అని వెల్లడించారు.అయితే ఇదే జరిగితే.. ప్రభాస్‌పై అల్లు అర్జున్ పైచేయి సాధించినట్టే అని ఆల్లు ఆర్మీ సంతోషంలో మునిగిపోయారు.

More from Filmibeat

Read more about: allu arjun prabhas pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X