1000 కోట్ల వసూళ్ల సెంటిమెంట్.. జూ. ఎన్టీఆర్ మూవీకి బిగ్ ప్లాన్?
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర 1000 కోట్ల సినిమాలు అంటే డెఫినెట్ గామన తెలుగు సినిమా నుంచే దాదాపు ఎక్కువ నంబర్స్ కనిపిస్తాయి. కాగా జస్ట్ గత ఏడాదిలోన్ మన తెలుగు సినిమా నుంచి రెండు 1000 కోట్ల సినిమాలు డెలివర్ అయ్యాయి. దీనితో తెలుగు సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మరి ఈ క్రమంలోనే అప్పటికే ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనే అనుకునే వాళ్ళ ఆందరికీ టాలీవుడ్ సినిమా ఊహించని షాకిచ్చింది.
ఇక దీనితో బాలీవుడ్ లో చాలా మంది బడా నిర్మాతలు మాత్రమే కాకుండా పలువురు హీరోలు కూడా కొంచెం ఇన్ సెక్యూరిటీ ఫీల్ అయ్యారు అనే మాటలు కూడా లేకపోలేవు. కానీ ఈ సమయంలోనే కొందరు నిర్మాతలు టాలీవుడ్ మహిమ తెలుసుకొని మన దగ్గర సినిమాలు స్టార్ట్ చేశారు. మన దర్శకులతో మాత్రమే కాకుండా హీరోలతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తూ క్లెవర్ మూవ్స్ తీసుకుంటున్నారు.

అయితే మామూలుగా మన తెలుగు సినిమాలోనే చాలా మంది సెంటిమెంట్స్ ఫాలో అవుతారు అనుకుంటున్నారా కానీ ఇపుడు హిందీ మార్కెట్ లో కూడా ఓ బీబీగ్ సెంటిమెంట్ ని వారు ఫాలో అవుతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సినిమా దగ్గర అనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర ఈ రెండు మూడేళ్ళలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేసాయి.
2022 డిసెంబర్ లో సలార్ అలాగే గత 2023 లో అనిమల్ అలాగే మొన్న 2024 ఏడాదిలో పుష్ప 2 సినిమాలు వచ్చి ఒకదాన్ని మించి ఒకటి రికార్డు గ్రాస్ లు అందుకున్నాయి. దీనితో అన్నిటిలో కామన్ గా డిసెంబర్ నెల కనిపిస్తుండడంతో బాలీవుడ్ నుంచి ఓ బిగ్ ప్రాజెక్ట్ అది కూడా భారీ మల్టీ స్టారర్ సినిమాని మేకర్స్ ఈ సెంటిమెంట్ ఫాలో అయ్యి 1000 కోట్లకి పైగా వసూళ్లు కొట్టాలని చూస్తున్నారట.

కాగా ఆ చిత్రం ఏదో కాదు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అలాగే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ల నుంచి వస్తున్న సినిమా వార్ 2 కి అట. కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పుడో 2025 ఆగష్టు రిలీజ్ కి కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ సినిమా లక్కీ నెల డిసెంబర్ కి షిఫ్ట్ చేస్తున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. పైగా మొన్న పుష్ప 1 అండ్ 2 లు కూడా ఆగష్టు నెల నుంచే డిసెంబర్ కి వాయిదా పడ్డవే కావడంతో వార్ 2 నిర్మాతలు 1000 కోట్ల వసూళ్లు కొట్టాలని మారుస్తునట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనితో ఈ టాక్ ఒక్క హిందీ సినీ కాకుండా తెలుగు సినీ వర్గాల్లో కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అయితే ఇంకో పక్క ఇవేమి నిజం కాదని వార్ 2 అనుకున్నట్టే వస్తుంది అంటూ కొందరు అంటున్నారు. మరి నిజం గానే వార్ 2 మేకర్స్ ఇలాంటి సెంటిమెంట్ లు నమ్ముతున్నారా లేదా అనేది మున్ముందు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని బ్రహ్మాస్త్ర ఫేమ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











