twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ దిల్ రాజు.. వకీల్‌సాబ్‌ కోసం డేరింగ్ నిర్ణయం.. V మూవీకి లాభం ఎంతంటే

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేక్షకుల నాడి కచ్చితంగా తెలిసిన నిర్మాత దిల్ రాజు. డిస్టిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన నిర్మాతగా మారాని ఆయన అత్యధిక విజయాలతో టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా స్థాయికి ఎదిగాడు. తాజాగా V చిత్రాన్ని రిలీజ్ చేసి లాక్‌డౌన్‌లో లాభాలు సాధించిన నిర్మాతగా, త్వరలో రిలీజ్ కానున్న వకీల్ సాబ్‌ విషయంలో కూడా ఓ డేరింగ్ నిర్ణయాన్ని తీసుకొన్నట్టు తెలుస్తున్నది. ఆ విషయాలు ఏమిటంటే..

    అమెజాన్ ఆఫర్‌ను తిరస్కరించిన దిల్ రాజు

    అమెజాన్ ఆఫర్‌ను తిరస్కరించిన దిల్ రాజు

    నిర్మాత దిల్ రాజు చేతిలో ఇప్పుడు వకీల్ సాబ్ లాంటి క్రేజీ ప్రాజెక్టు రెడీగా ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూసివేయడంతో సినిమా రిలీజ్ కూడా ఆలస్యమవుతున్నది. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ఆఫర్ ఇచ్చి ఓటీటీ రిలీజ్ చేయమని అడిగితే అందుకు నో చెప్పారట.

    100 కోట్లు ఇచ్చినా వకీల్ సాబ్‌ను ఓటీటీలో రిలీజ్ చేయను

    100 కోట్లు ఇచ్చినా వకీల్ సాబ్‌ను ఓటీటీలో రిలీజ్ చేయను

    వకీల్ సాబ్ చిత్రం ఓటీటీ హక్కుల కోసం దిల్ రాజుకు అమెజాన్ రూ.80 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిందనే తాజాగా మీడియాలో ఓ వార్త వైరల్ అవుతున్నది. అయితే 100 కోట్లు ఆఫరిచ్చినా గానీ వకీల్ సాబ్‌ను ఓటీటీ రిలీజ్ చేయనని మొహమాటం లేకుండా చెప్పారట. ఆ క్రమంలోనే పవర్ స్టార్ సినిమాను డైరెక్టుగా థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని దిల్ నిర్ణయించుకొన్నారనేది తాజా సమాచారం.

    థియేటర్లు ఓపెన్ అయితే వకీల్‌ సాబ్‌ను రిలీజ్ చేయాలని

    థియేటర్లు ఓపెన్ అయితే వకీల్‌ సాబ్‌ను రిలీజ్ చేయాలని

    థియేటర్లు ఓపెన్ అయితే టాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ లేదా, టాప్ హీరో సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు సినిమా హాళ్లకు రప్పించ వచ్చనే ప్లాన్‌లో నిర్మాతలు ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రాన్ని థియేటర్లలో మొదటి సినిమాగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

    Recommended Video

    Ravana Lanka Movie Audio Launch
    V మూవీకి భారీ లాభంతో దిల్ రాజు

    V మూవీకి భారీ లాభంతో దిల్ రాజు

    ఇదిలా ఉండగా, ఇటీవల అమెజాన్‌లో రిలీజైన V చిత్రం దిల్ రాజుకు లాభాల పంట పడించింది. లాక్‌డౌన్ కాలంలో థియేటర్‌లో రిలీజ్ చేయాలని చూసిన దిల్ రాజు.. కనీసం ఆరు నెలలు వేచి చూసిన తర్వాత ఓటీటీలో రిలీజ్‌కు ముందుకొచ్చారు. ఈ సినిమా కోసం 33 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, ఓటీటీ బిజినెస్ ద్వారా 31 కోట్ల రూపాయలు, శాటిలైట్ ద్వారా 7 కోట్లు, డబ్బింగ్ రైట్స్ 8 కోట్లు వచ్చినట్టు సమాచారం.

    English summary
    Tollywood movie releases stalled due to Coronavirus. All theares of Telugu states closed due to Lockdown.In this situation Many movies are releasing in OTT. In this juncture, V Movie released on Amazon for 31 crores. After that Vakeel saab gets 80 crores offer to Dil raju from Amazon. Reports suggest that dil raju has rejected fancy offer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X