ఈ ఏరియాలో సలార్‌కు భారీ నష్టాలు.. ఇప్పుడు లాభాల పంట పండిస్తున్న కల్కి!

దాదాపు ఇండియా వైడ్ గా ఉన్న అన్ని సినీ మార్కెట్ లలో అది కూడా మన తెలుగు హీరోస్ లో అయితే మంచి క్రేజ్ ఉన్న తక్కువ మంది హీరోస్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకడు. కాగా గడిచిన కొన్నేళ్లలో ప్రభాస్ క్రేజ్ అండ్ మార్కెట్ కూడా బాగానే పెరిగాయి. దీనితో తన సినిమాలకి మంచి డిమాండ్ కూడా నెలకొనగా ఇలా తన సినిమాలకి రిలీజ్ కి ముందే భారీ స్థాయి బిజినెస్ లు థియేట్రికల్ గా ఓటిటి పరంగా జరుగుతున్నాయి.

అలా ప్రభాస్ నటించిన తాజా చిత్రం "కల్కి 2898 ఎడి" కి కూడా భారీ బిజినెస్ జరిగి థియేటర్లు లోకి వచ్చింది. రావడంతోనే బ్యాంగర్ లా భారీ ఓపెనింగ్స్ అందుకొని ఈ చిత్రం దుమ్ము లేపింది. కాగా ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో అయితే ఈ సినిమా జరుపుకున్న బిజినెస్ కి గాను గట్టి మంచి లాభాలనే అందించే దిశగా దూసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది.

is kalki 2898 ad recovering all the loses of salaar in USA and Telugu States

మెయిన్ గా ఓవర్సీస్ మార్కెట్ మరియు తెలుగు రాష్ట్రాల్లో కల్కి పెర్ఫామెన్స్ కోసం ఇపుడు మాట్లాడుకోవాలి. ప్రభాస్ దీనికి ముందు నటించిన చిత్రం చిత్రం "సలార్" కోసం అందరికీ తెలిసిందే. ఇది దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా ఈ సినిమా కూడా భారీ వసూళ్లే రాబట్టింది కానీ ఓవర్ హైప్ అండ్ బిజినెస్ మూలాన నార్త్ అమెరికాలో భారీ నష్టమే మిగిలింది.

ఈ చిత్రానికి నార్త్ అమెరికాలో 70 కోట్లకి పైగా బిజినెస్ జరిగితే ఇందులో కేవలం 70 నుంచి 80 శాతం మాత్రమే రికవర్ అయ్యింది. దీనితో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు తప్పలేదు. కానీ సలార్ లాంగ్ రన్ వసూళ్లను కల్కి ఇపుడు ఇదే నార్త్ అమెరికాలో కేవలం ఈ నాలుగు రోజుల్లోనే రాబట్టేసింది. దీనితో సలార్ వల్ల వచ్చిన నష్టాలు అయితే కల్కి రూపంలో ఇప్పుడు తీరుతున్నాయి అని చెప్పాలి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సలార్ తో స్వల్ప నష్టాలు వచ్చాయి కానీ ఇది కూడా కల్కి లాంగ్ రన్ తో అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. సో ఇలా సలార్ వల్ల వచ్చిన నష్టాలు కల్కి అయితే పూడుస్తుందనే అనుకోవాలి. కాగా ఈ భారీ ప్రాజెక్ట్ లో ఉలగనయగన్ కమల్ హాసన్ అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంకా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సహా మృణాల్ ఠాకూర్, దిశా పటాని, దీపికా పదుకొనె తదితర ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగం పంచుకున్నారు.

అలాగే నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా పలు భాగాలుగా ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాలు చేయబోతున్నాడు. కాగా పార్ట్ 2 అయితే రానున్న 2026 లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ పార్ట్ 2 కి 60 శాతం మేర షూటింగ్ పూర్తయ్యి పోయింది.

More from Filmibeat

Read more about: prabhas salaar kalki 2898 ad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X