Sarkaru Vaari Paata కలెక్షన్లు ఫేకా? ఎంత మేరకు మ్యానిపులేషన్ అంటే?
టాలీవుడ్‌లో ఏ చిత్రం కూడా వివాదంలో చిక్కుకోనంతగా సర్కారు వారీ పాట చిత్రం కలెక్షన్లు మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. సోషల్ మీడియా, మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలను పట్టించుకోకుండా సర్కారు వారి పాట సినిమా యూనిట్ భారీ వసూళ్లను సాధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే సర్కారు వారి పాట కలెక్షన్ల వివాదంలోకి వివరాల్లోకి వెళితే..

ఆరు రోజులు కలెక్షన్లు ఇలా
ట్రేడ్ అనలిస్టులు వెల్లడించిన లెక్కల ప్రకారం.. సర్కారు వారి పాట చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 75 కోట్లకుపైగా, రెండో రోజు 27.5 కోట్లు, మూడో రోజు 28.84 కోట్లు, నాలుగో రోజున 29.12 కోట్లు, ఐదో రోజున 9.38 కోట్లు, ఆరో రోజున 5.25 కోట్లు వసూలు చేసింది దాంతో ఈ చిత్రం 175 కోట్ల మైలు రాయిని అధిగమించినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

వసూళ్ల వివరాలు తప్పేనా?
సర్కారు వారి పాట చిత్రం యూనిట్ వెల్లడిస్తున్న కలెక్షన్లు వివరాలు అంతా తప్పే. ఈ సినిమా సాధించిన వసూళ్లకు, బయట చెబుతున్న లెక్కలకు పొంతన లేదు అనే విషయాన్ని డిస్డ్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు మధ్య చర్చ జరుగుతున్నది. సినీ వర్గాల్లో కూడా సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ రిపోర్టుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కలెక్షన్లపై భారీగా ట్రోల్స్
అయితే సర్కారు వారి పాట సినిమా యూనిట్ వెల్లడించిన కలెక్షన్ల వివరాలపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ జరిగాయి. #SVPdisaster అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేశారు. అయితే ట్రోల్స్‌కు ధీటుగా సమాధానం చెబుతూ #SVPblackbuster అంటూ ట్రెండింగ్ చేశారు. మహేష్ బాబు సినిమా విషయంలో ఎన్నడూ లేని విధంగా నెగిటివ్ ప్రచారం జరగడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది

40 శాతం మ్యానుపులేషన్
సర్కారు వారి పాట కలెక్షన్లపై సినీ వర్గాలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పెదవి విరుస్తున్నారు. సినిమా యూనిట్ వెల్లడించిన వివరాల్లో 40 శాతం మ్యానుపులేషన్ జరిగిందనే వాదన వినిపిస్తున్నది. సర్కారు వారీ పాట సినిమా కలెక్షన్లలో ఇప్పటి వరకు వెల్లడించిన వివరాల్లో వాస్తవం లేదనే మాటను బలంగా వినిపిస్తున్నారు.

100 కోట్ల షేర్‌లో 40 శాతం
సర్కారు వారీ పాట సాధించినట్టు చెబుతున్న 175 కోట్ల కలెక్షన్లలో 40 శాతం ఎక్కువ ఉంది. జీఎస్టీ, ఇతర ట్యాక్సులు మినహాయించలేదు. అలాగే ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ల కమిషన్లు కూడా మినహాయించలేదు. 100 కోట్ల షేర్‌లో 40 శాతం మ్యానుపులేషన్ జరిగిందని, ఇప్పటి వరకు సుమారు 60 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసిందనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్నది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో త్వరలోనే వెల్లడి ఖాయం అంటున్నారు.


Click it and Unblock the Notifications











