వెంకీ..'నమో వెంకటేశ' ఓవర్ బడ్జెట్?
వెంకటేష్,త్రిష కాంబినేషన్లో శ్రీను వైట్ల రూపొందించిన 'నమో వెంకటేశ' చిత్రం ఓవర్ బడ్జెట్ అయ్యిందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. దాదాపు 24 కోట్ల రూపాయల వ్యయం అయ్యిందని, వెంకటేష్ గత చిత్రాలు ఏదీ ఇంత బడ్జెట్ లో కాలేదని అంటున్నారు. ఆయన చిత్రాలలో ఇప్పటి వరకూ ఎమ్.ఎస్.రాజు నిర్మించిన దేవీ పుత్రుడు హైయిస్ట్ బడ్జెట్. అదీ గ్రాఫిక్స్ వలనే అయింది. వెంకటేష్ చిత్రాలు సాధారణంగా కుటుంబం,భావోద్వేగాలు చుట్టూ తిరుగుతూ లొకేషన్స్ తక్కువ ఉండటంతో బడ్జెట్ పెద్దగా కాదు. దాంతో ఎప్పుడూ డెఫిషిట్ లో రిలీజ్ కావటం జరగదు. అయితే శ్రీను వైట్ల మీద ఉన్న క్రేజ్ తో ఈ చిత్రం బడ్జెట్ పెంచారని తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తున్నారు. ప్యారిస్ ప్రసాద్ గా బ్రహ్మానందం నవ్వులపై ఎక్కువ ఆధారపడే కథనం తయారైందని వినికిడి. ఈ చిత్రంలో వెంకటేష్ వెంట్రిక్వాలిజిస్టు గా కనపడతారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు షూటింగ్ లేటెస్ట్ గా హైదరాబాద్ లో జరిగింది. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా చేస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి హిట్ కొట్టే యోచనలో ఉన్నారు. అందులో ఢీ,రెడీ,కింగ్ అంటూ శ్రీను వైట్ల వరసగా హిట్లు కొట్టడంతో మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











