Devara Day 1 Advance Booking: ఇండియాలోనే దేవర రికార్డు అడ్వాన్స్ బుకింగ్.. ప్రభాస్, షారుక్‌ను మించి ఎన్టీఆర్!

తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద రిలీజ్‌కు ముందే హంగామా చేస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వలో రూపొందిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ రూపంలో కలెక్షన్ల హల్‌చల్ క్రియేట్ చేస్తున్నది. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనాల వివరాల్లోకి వెళితే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా 6 ఏళ్ల తర్వాత సోలో రిలీజ్‌గా దేవర వస్తుండటంతో సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాకు ట్రేడ్ సర్కిల్స్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో ఈ మూవీకి రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నడూలేని విధంగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రం 182 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసుకొన్నది.

Is Jr NTR s Devara Day 1 Expected Advance Booking Box Office Collections will cross 125 crores Worldwide

ఇటీవల ప్రారంభమైన దేవర అడ్వాన్స్ బుకింగ్‌కు అభిమానులు పొటెత్తారు. దాంతో రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం ప్రతీ ప్రాంతంలో భారీ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేస్తున్నది. ఇంకా రెండు రోజులు ఉండగానే ఈ సినిమా కోట్లు కురిపిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 75 శాతం అక్యుపెన్సీతో 12 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. వైజాగ్‌లో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 1 కోటికిపైగా, విజయవాడలో 65 లక్షలు వసూలు చేసింది. ఆంధ్రా, నైజాంలో కలిపి ఈ సినిమా 25 కోట్లకుపైగా కలెక్షన్లను ప్రీ సేల్స్‌గా నమోదు చేసింది.

Is Jr NTR s Devara Day 1 Expected Advance Booking Box Office Collections will cross 125 crores Worldwide

ఇక తెలుగేతర రాష్ట్రాల్లో ఈ మూవీకి మంచి బజ్ కనిపిస్తున్నది. బెంగళూరులో 3.5 కోట్లు, కర్ణాటక వ్యాప్తంగా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ ఇండియాలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ 30 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 30 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ 50 నుంచి 60 కోట్ల రూపాయలుగా నమోదు అయింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

అయితే తాజా అడ్వాన్స్ బుకింగ్ అంచనాల ప్రకారం.. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రాల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు సుమారుగా 125 కోట్ల రూపాయలుగా వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జోష్ కొనసాగితే.. ఈ మొత్తం కూడా పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Read more about: devara jr ntr box office
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X