పవన్ స్టామినా 200 కోట్లా!.. మ్యాజిక్ ఫిగర్‌పై కన్నేసిన పవర్‌స్టార్
బాహుబలితో టాలీవుడ్ స్టామినా ఒక్కసారిగా పెరిగింది. అయితే బాహుబలికి ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ సత్తా ఏమిటో అత్తారింటికి దారేది పవన్ నిరూపించాడు. త్రివిక్రమ్ రూపొందించిన ఈ చిత్రం తొలిసారి టాలీవుడ్‌కు వందకోట్ల రుచి చూపించింది. వీరి కాంబినేషన్‌లోనే వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం మరోసారి టాలీవుడ్‌కు మ్యాజిక్ ఫిగర్‌ను పరిచయం చేయబోతున్నదని అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
Recommended Video


పవన్ లక్ష్యం 200 కోట్లు
ఒకప్పడు బాలీవుడ్‌కే పరిమితమైన రూ.100 కోట్ల క్లబ్ లక్ష్యం తెలుగు హీరోలకు కూడా సాధ్యమవుతున్నది. స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ.100 కోట్లను టచ్ చేస్తున్నాయి. ఇటీవల సరైనోడు, జై లవకుశ, స్పైడర్ చిత్రాలు ఆ స్టామినాను ప్రూవ్ చేశాయి.

పవన్ మ్యాజిక్ ఫిగర్ ఇదే
ఇక ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమా విడుదల నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.100 కోట్లకుపైగానే ఉండే అవకాశముందని అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రస్తుతం అజ్ఞాతవాసి చిత్రం ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవచ్చని బలంగా నమ్ముతున్నారు.

ప్రి రిలీజ్ బిజినెస్
పవన్ కల్యాణ్ సినిమాకు శాటిలైట్ రైట్స్ రేటు కూడా భారీగానే ఉంటుంది. ఇక సినిమా బిజినెస్ బాగా విస్తరించింది. డిజిటల్ రైట్స్, ఆడియో ఇలాంటివి లెక్కలేస్తే బిజినెస్ దండిగా ఉంటుంది. ఇలాంటివి అంశాలను పరిగణనలోకి తీసుకొంటే అజ్ఞాతవాసి కలెక్షన్లు సరికొత్తగా ఉండబోతున్నాయనేది స్పష్టమవుతున్నది.

థియేటర్లు, స్క్రీన్ల సంఖ్య
ఎందుకంటే అజ్ఞాతవాసి చిత్రం రిలీజయ్యే థియేటర్లు, స్రీన్ల సంఖ్య భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువ ప్రదేశాల్లో కూడా రికార్డు స్థాయిలో రిలీజ్ చేసున్నారు. దీంతో తొలివారమే ఈ సినిమా ఈ చిత్రం వంద కోట్లు వసూలు చేస్తుందనే వార్త వినిపిసిస్తున్నది.

కలెక్షన్ల కుంభవర్షం
ఒకవేళ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే ఇక కలెక్షన్ల కుంభవర్షమే. ఎందుకంటే పవన్ సినిమా యావరేజ్ అని టాక్ వచ్చినా రికార్డు కలెక్షన్లు ఉంటాయి కనుక. కాబట్టి విడుదలకు ముందే ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.

ఆడియో ఫంక్షన్‌కు సర్వం సిద్ధం
అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ను మంగళవారం (డిసెంబర్ 19న) నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

టీజర్‌కు రికార్డుస్థాయి వ్యూస్
శనివారం రిలీజైన అజ్ఞాతవాసి టీజర్ యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్నది. రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకొంటూ దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు 7,630,174 వ్యూస్‌ను, 443286 లైకులను సాధించింది. త్వరలోనే యూట్యూబ్‌లో ఓ రికార్డు సాధించే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











