కల్కి 1000 కోట్ల తర్వాత.. ఆ డైరెక్టర్‌తో ప్రభాస్ మూవీ టార్గెట్ 2000 కోట్ల కలెక్షన్లా?

ఒకో సమయంలో ఒకో స్టార్ హీరో ఎరా ఇండియన్ సినిమా దగ్గర నడుస్తూ ఉంటుంది. ఆయా భాషల్లో ఇండియా మొత్తం సెన్సేషనల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోలు చాలా తక్కువమంది మాత్రమే ఉంటారు. అలా ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ఉన్న తక్కువ మంది హీరోస్ లో ఒకప్పుడు కోలీవుడ్ నుంచి రజినీకాంత్ ఉంటే మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆ ఛాన్స్ ఉన్నప్పటికీ తమిళ్, హిందీ మార్కెట్ లని పట్టించుకోకుండా కేవలం టాలీవుడ్ కే పరిమితం అయ్యి చిరు వేరే దారి వేసుకున్నారు.

కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే పాన్ ఇండియా దారిలో అనేకమంది హీరోస్ వెళుతున్నారు. మరి ఈసారి మాత్రం ఇండియా వైడ్ గా రెబల్ స్టార్ ప్రభాస్ ఎరా నడుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రభాస్ నటించిన సినిమాలు మినిమమ్ 200 కోట్లకి తగ్గకుండా అది కూడా టాక్ తో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి. అందుకే ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ స్టార్స్ లో ప్రభాస్ ఒకడే యూనానిమస్ గా నిలిచాడు.

Is Prabhas and Sandeep Reddy Vanga s Spirit targetting 2000 Crores after kalki 2898 AD s 1000 Crores Mark

కాగా ఇపుడు తనకి హిట్ పడితే అది మినిమమ్ 500 నుంచి 1000 కోట్లు వరకు లాగేస్తుంది. అయితే ఇక్కడ ప్రభాస్ సినిమాల్లో ఇంట్రెస్టింగ్ అంశం కనిపిస్తుంది. ప్రభాస్ గత సినిమాల్లో చూస్తే చాలా తక్కువ సినిమాలు ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకులకే తాను అవకాశం ఇచ్చాడు. పోస్ట్ బాహుబలి తన నుంచి సాహో, రాధే శ్యామ్ లు మన సౌత్ దర్శకుల నుంచి వచ్చాయి. వీటికి ఆ దర్శకులకి కేవలం ఒక్క సినిమా మాత్రమే ఎక్స్ పీరియన్స్ ఉంది.

కానీ రెండు లేదా అంతకు మించి సినిమాలు చేసిన దర్శకులతో సినిమా చేస్తే మాత్రం ప్రభాస్ సినిమాలు వసూళ్లతో దుమ్ము లేపుతున్నాయి. కాగా ఆ రెండు సినిమాలు తర్వాత సౌత్ దర్శకులలో చూస్తే మూడు సినిమాలు ఎక్స్ పీరియన్స్ ఉన్న ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తే 700 కోట్లు, రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తే ఇది ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

Is Prabhas and Sandeep Reddy Vanga s Spirit targetting 2000 Crores after kalki 2898 AD s 1000 Crores Mark

మరి ఈ రెండు సినిమాల తర్వాత మళ్ళీ ఇదే రీతిలో అర్జున్ రెడ్డి, అనిమల్, కబీర్ సింగ్ వంటి మూడు సినిమాలు మాత్రమే చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో "స్పిరిట్" అనే పాన్ ఆసియ సినిమా ఉంది. దీనిపై అంచనాలు ఇప్పుడు ఆకాశంలో ఉన్నాయి. దీనితో డెఫినెట్ గా ఆ సెంటిమెంట్ ని వీరి కాంబినేషన్ కూడా అందుకుంటుంది అని చెప్పొచ్చు. అసలే ఆ సినిమా ఊహించని ప్లానింగ్ లు వేస్తున్నారని కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఒకవేళ అవన్నీ సెట్టయితే 1000 కోట్లు ఏం ఖర్మ 2000 కోట్ల వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తుందో లేదా అనేది కొన్నాళ్ళు ఆగి చూడాలి.

More from Filmibeat

Read more about: prabhas kalki 2898 ad spirit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X